రెబ్బెన : ఖైరి గూడ ఓపెన్ కాస్ట్ లో పని చేస్తున్నా సర్ఫేస్ జనరల్ మజ్దూర్ లు కొందరికి బేసిక్ లో కోత విధించిన దాన్ని తిరిగి సరిచేయాలని ఖైరిగుడా గాని మేనేజర్ శ్రీ ఉమా కాంత్ గారికి వినతి పత్రం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీ మల్రాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది .ఈ సందర్భంగా గా శ్రీనివాస రావు మాట్లాడుతూ కొంతమంది జెనరల్ మాజదుర్లు ఇతర ఏరియాల నుండి బెల్లంపల్లి ఏరియకు పోస్టింగ్ ఇచ్చారు కానీ వారికి ఉన్న బేసిక్ ను తగ్గించడం జరిగింది అని కానీ ఇతర కొన్ని ఏరియాలలో బేసిక్ తగ్గించకుండా నే సర్ఫేస్ జనరల్ మజ్దూర్ గా ఇచ్చారని అదేవిధంగా బెల్లంపల్లి ఏరియా లో కూడా సరిచేయాలని డిమాండ్ చేశారు .
సింగరేణిలో అన్ని ఏరియాలలో ఒకే విధంగా ఉండాలి కానీ ఏరియాకు ఒక విధంగా బేసిక్ ను అమలు చేయడం సరికాదన్నారు వెంటనే తగ్గించిన బేసిక్ సరి చేయనట్లయితే ఖైరిగుడా ఓపెన్ కాస్ట్ లో ఉత్పత్తి నిలిపివేయడానికి కోసం ధర్నా కార్యక్రమం చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. వెంటనే బెల్లంపల్లి ఏరియా యాజమాన్యం కార్పొరేట్ వారితో మాట్లాడి తగ్గించిన బేసిక్ ను సరి చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ ప్రకాష్ రావు ఏరియా కార్యదర్శి రాజు జిఎం కమిటీ మెంబర్ మారిన వెంకటేష్ ఏరియా నాయకులు నర్సింగరావు భాస్కరచారి బొంగు వెంకటేష్ పిట్ కార్యదర్శి కార్ణాతం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment