రెబ్బెన : ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటి అధ్యక్షురాలిగా ఎన్నికైన అయేషా గోష్ వామపక్ష విద్యార్థి నాయకురాలి పైన యూనివర్సిటీ ప్రొఫెసర్ మీద,సామాన్య విద్యార్థుల మీద నిన్న రాత్రి జరిగిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు.JNU లో పాగా వేసేందుకు మతోన్మాద సంఘాలు ఇలాంటి దాడులు చేస్తూ విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే వారిపైన దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు.ఇలాంటి దాడులు పునరావృత్తం అవుతే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
No comments:
Post a Comment