రెబ్బెన: మాఘ శుద్ధ పౌర్ణమి సంధర్బంగా బుధవారం నాడు కుమురం భీమ్ జిల్లా రెబ్బెన మండలం గంగపూర్ లో గల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామీ రధోత్సవం భక్తజన సంద్రోహం మధ్య ఘనంగా జరిగింది. ప్రతి ఏట నిర్వహించే ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యాలో పాల్గొన్నారు.భక్తుల సౌకర్యర్ధం ధర్మ దర్శనము,ప్రత్యేక దర్శనము, విఐపి దర్శనములు ఏర్పాటు చేశారు. స్వామీ వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తుల సౌకార్యార్ధం కొంతమంది భక్తులు, వ్యాపారులు, కలసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా త్రాగునీటి సమస్య ఏర్పడకుండా వివిధ స్వచ్చంధ సంస్థలు,జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ ఆధ్వర్యంలో త్రాగు నీరు అందించారు.. వైద్య ఆరోగ్య శాఖ మరియు రెబ్బెన ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. వ్యవసాయ శాఖ,అంగన్వాడీ వారి అద్వర్యం లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. జాతరకు హాజరైన భక్తులు మాట్లాడుతూ సౌకర్యాలను మరింత మెరుగు పరచాలని, గంగపూర్ ను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు.అదే విధంగా రెబ్బెన నుండి గంగపూర్ వెళ్లే తారు రొడ్డును రెండు వరసల రహదారిగా నిర్మించాలని అన్నారు.జాతరలో ఏర్పాటు చేసిన జైంట్ వీల్ ,వివిధ ఆటలు భక్తులను ఆకట్టుకున్నాయి.జాతరలో ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు,ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండ డిఎస్పీ సత్యనారాయణ అద్వర్యంలో పోలీస్ తో విధులు నిర్వహించారు.
No comments:
Post a Comment