రెబ్బెన : ఫిబ్రవరి 22 నుండి 24 వరకు మంచిర్యాలలో జరుగు సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలకు తరలిరావాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతి,సీపీఐ మండల కార్యదర్శి దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాలను గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్లో విడుదల చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. దున్నేవాడికె భూమి దక్కాలని ఎన్నో వీరోచిత పోరాటాలు నిర్వహించి భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నరసయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి జగ్గయ్య, గోలేటి పట్టణ కార్యదర్శి మారం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కస్తూరి రవికుమార్,ఎ.ఐ.వై.ఎఫ్. జిల్లా సహాయ కార్యదర్శి రహీం,ఎ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా ఉపాధ్యక్షుడు పుదరి సాయి, డివిసన్ కార్యదర్శి పర్వతి సాయి,చారి పాల్గొన్నారు.
No comments:
Post a Comment