Thursday, 27 February 2020

పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి

రెబ్బెన : చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు ఆ చిన్న వయసులోనే దేశ స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు  చేశారని   నక్కల గూడా ప్రాథమిక పాఠశాల కల్వల శంకర్  అన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకొని రెబ్బెన మండలం నక్కల గూడా ప్రాథమిక పాఠశాలలో ఆయన చిత్రపటానికి  విద్యా కమిటీ వైస్ చైర్మన్ చౌదరి లక్ష్మీ గారు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పాఠశాల  మాట్లాడుతూ భారత దేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్లలో ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు అలాంటి వారిలో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు ఆ చిన్న వయసులోనే దేశ స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశాడు భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్ గురు లాంటి వారితో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను ప్రారంభించారు  ఆయన పోరాటం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం విద్యార్థులు చిన్నప్పటినుండి  దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులు ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment