రెబ్బెన : అప్పుడే పుట్టిన పాప నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎంపీపీ సౌందర్య ఆనంద్,జడ్పీటీసీ సంతోష్ లు అన్నారు. ఆదివారం రెబ్బెన మండలంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతు తమ పిల్లల భవిష్యత్తు కొరకు, పోలియో రహిత సమాజం కొరకు తల్లిదండ్రులందరూ ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల తమ పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జ్వరం వచ్చినా కూడా పోలియో చుక్కలు వేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అహల్యాదేవి, ఎంపీటీసీ మధునయ్య, డాక్టర్ వినోద్ కుమార్,నర్స్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment