రెబ్బెన: శరీరంపై ఎక్కడైనా స్పర్శ లేకుండా తెల్లటి మచ్చలు ఉంటే తక్షణమే వైద్య నిపుణులను సంప్రదించాలని పులి కుంట ఉపా సర్పంచ్ మల్రాజ్ శృతి అన్నారు. గురువారం రెబ్బెన మండలంలోని పులి కుంట గ్రామంలో కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా భవిష్యత్తులో కుష్టు వ్యాధి రహిత భారతదేశ నిర్మాణంలో అందరం కలిసి కృషిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ మైలారపు స్వరూప, అంగన్వాడి టీచర్ స్వప్న, గ్రామస్తులు మల్రాజ్ రాంబాబు, వెంకటేష్ రమేష్ ,కవిత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment