Wednesday, 26 February 2020

బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 రెబ్బన ; తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో సోమవారం  గోలేటి లోని టీబీజీకేఎస్ కార్యాలయం లో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు  శ్రీనివాసరావు   జెండాను ఎగరవేశారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న ఆంధ్ర సంఘాలు కార్మికులకు పెడుతున్న ఇబ్బందుల నుండి రక్షించి సింగరేణి కార్మికులకు అవసరమైన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా యూనియన్ ప్రారంభించడం  జరిగిందన్నారు. ఏదైతే లక్ష్యంతోనే ఈ యూనియన్ను ప్రారంభించామో  CM కేసీఆర్  మరియు గౌరవ  MP, MLA, ల కృషి మేరకు ఆ లక్ష్యం నెరవేరిందని సింగరేణి కార్మికులకు అన్ని హక్కులు సాధించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రకాష్ రావు రామ్ రెడ్డి రవీందర్ GM ఆఫీస్ పిట్ కార్యదర్శి లక్ష్మీనారాయణ ,నాయకులు రమేష్ మహేష్ ,షర్ఫుద్దీన్ సుగ్రీవులు ,కుమార్ వెంకటేష్ దేవేందర్ ,,హరి సింగ్ తదితరులు

No comments:

Post a Comment