Wednesday, 26 February 2020

కళాశాలకు మంచిపేరు తేవాలి : జడ్పిటిసి వేముర్ల సంతోష్



 రెబ్బెన : అధ్యాపకులకు కళాశాలకు పేరు తెచ్చేలా విద్యార్థుల ప్రవర్తన ఉండాలని రెబ్బెన జెడ్పిటిసి వేముర్ల సంతోష్ అన్నారు. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన కళాశాల వార్షిక దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ చాలా ముఖ్యమైనదనన్నారు. ఈ దశలో తీసుకున్నన నిర్ణయాలు భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని అన్నారు ఈ దశలో తీసుకున్నన నిర్ణయమే భవిష్యత్తును బంగారుబాట గా మార్చితుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం కూడా మధ్యాహ్నన భోజన కార్యక్రమం అమలుు చేయడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు.   మాట్లాడుతూ విద్యార్థులకు క్రమం తప్పకుండా అన్ని రకాల అంశాలలో చేయూత అందించామన్నారు. విద్యార్థులు రానున్నన పరీక్షల్లో ప్రతిభ కనబర్చి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అంతకు విద్యార్థులుు మాట్లాడుతూ కళాశాలతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.  కళాశాల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ముఖ్య అతిథులను విద్యార్థులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో  మరో ముఖ్య అతిథి జూనియర్ లెక్చరర్ అస్మత్,కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, కళాశాల అధ్యాపకులు సతీష్ ఇతర అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment