Wednesday, 26 February 2020

ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిగా రహీం

రెబ్బెన :   అఖిలభారత యువజన సమైక్య ఏ ఐ వై ఎఫ్ జిల్లా మహాసభలో గోలేటి గ్రామానికి చెందిన ఎండి రహీం ను జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం  ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన అఖిలభారత యువజన  సమైక్య సమావేశం లో ఎన్నుకున్నట్లు తెలిపారు. రహీం ఎన్నికపై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ , పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment