రెబ్బెన ; ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగరీత్యా పదవీ విరమణ సహజమని రెబ్బన తహశీల్దార్ రియాజ్ అలీ అన్నారు. శుక్రవారం అంకితభావంతో కార్యాలయంలో సబార్డినెట్ పనిచేసి రిటైర్మెంట్ అవుతున్న మహ్మద్ సర్వర్ ను మండల తహసీల్దార్ రియాజ్ అలీ ,డిప్యూటీ తహసీల్దార్ సరితా ,మరియు రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్.ఐ ఊర్మిల,జయరాం, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, విఆర్వోలు శిరీష ,దేవిక, సంతోష్ , గణపతి , ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగె ఉపేందర్, రేషన్ డీలర్లు రామయ్య ,మురళి ,ప్రభాకర్, శంకర్ ,తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment