రెబ్బన : ప్రతి గ్రామ పంచాయితీ కార్మికులకు షరతులు లేకుండా సిబ్బందికి జి.ఓ. నెంబర్.51 ప్రకారం వేతనలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు, ఆదివారం రెబ్బన లోని ఆర్.అండ్ బి గెస్ట్ హౌస్ లో మండలం ఏఐటీయూసీ గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిిగా హాజరై ఆయన మాట్లాడారు గ్రామపంచాయతీ కార్మికులు సుమారుగా 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ, నిత్యం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ,గ్రామాలు అభివృద్ధి చెందడం లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు, ,ప్రతి నెల 10 తేదీ లోపు 010 ట్రెసరి ద్వారా ఎలాంటి షరతులు విధించకుండా అందరికి 8500 రూపాయలు జీతాలు చెల్లించాలని అన్నారు, ఈ సమావేశంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్,గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శంకర్,అన్నాజీ, కారోబర్లు మహేందర్,లక్ష్మణ్,దేవాజి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment