Wednesday, 26 February 2020

జీపి కార్మికులను శ్రమదోపిడికి గురిచేస్తున్న ప్రభుత్వం ; ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్

రెబ్బెన :     గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీ గురిచేసిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు, బుధవారం రోజున గ్రామ పంచాయితీ కార్మికులకు GO నెంబర్ 51 ప్రకారం 8500 వేతనాలు 010 ట్రెసరి ద్వారా ఇవ్వాలని డిమాండ్  చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెబ్బన ఎంపీడీఓ కార్యాలయం ధర్నా  చేశారు,అనంతరం ఎం.పీ.ఓ అంజత్ పాషాకు వినతిపత్రం ఇచ్చారు,అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడారు .గత 20 సంవత్సరాల నుంచి చాలి చాలని వేతనాలు తీసుకుంటూ,గ్రామ పంచాయితీలు అభివృద్ధి చెందడంలోను,పరిశుభ్రత పరచడం లోను అత్యంత కీలకమైన పాత్ర పోషించిస్తున్నారని అన్నారు,కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని, అలాగే కనీస వేతనం 21 వేలు ఇవ్వాలని,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐడెంటిటీ కార్డ్ ,ఈ.ఎస్.ఐ,పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలని, కారొబార్లను పంచాయతీ కార్యదర్సులుగా గుర్తించాలని,ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ శంకర్,ప్రకాష్,నాయకులు మల్లయ్య,సుబ్బయ్య,లక్ష్మణ్,లతో పాటు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment