రెబ్బెన : గ్రామ పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లను పూర్తిస్థాయిలో పరిశుభ్రతకు వినియోగించాలని జిల్లా జెడ్ పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ అన్నారు. శనివారం మండలంలోని తక్కలపల్లి, రోళ్లపాడు, పులికుంట, రాజారాం,ఇందిరానగర్ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరంం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమలు ప్రజలకు ఉపయోగపడేల ఉంటాయని.ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని ఈ యొక్క ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కె దక్కుతుందని అన్నారు ఈయొక్క గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను ఉపయోగించి గ్రామ పంచాయతీ ని అభివృద్ధి పధంలో తీసుకెళ్ళాలని సూచించారు ఈ కార్యక్రమంలో డి పి ఓ రమేష్, జడ్పీటీసీ సంతోష్,ఎంపీటీసీ సంగం శ్రీనివాస్,సర్పంచులు పోషమల్లు, రాజా లక్మి,మల్లేష్, హన్మక్క,trs కార్యకర్తలు ఆనంద్,సుదర్శన్ గౌడ్,శ్రీధర్, ప్యాక్స్ చైర్మన్ సంజీవ్ కుమార్ ఉప సర్పంచులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment