రెబ్బెన : చలో గౌడ మోకు దెబ్బ జన జాతర.. తేదీ 2 న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు. బుధవారం రెబ్బెన మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చలో గౌడ మోకు దెబ్బ జన జాతర సంబంధించిన వాల్ పోస్టర్లలను విడుదల చేసరు. అనంతరం మాట్లాడుతూ గీత కార్మికులను గుర్తించిి లైసెన్స్, ప్రమాద భీమాను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి జరిగిన నెలలోపే ఎలాంటి షరతులు లేకుండా అందించాలన్నారు. సమస్యల పెె నిర్వహించు సభను విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి గౌడ్. జిల్లా కార్యవర్గ సభ్యులు మడిపల్లి లక్ష్మీనారాయణ గౌడ్ గుడిసెల వెంకటేశ్వర గౌడ్ తాళ్లపల్లి ప్రభాకర్ గౌడ్. మండల ఉపాధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment