రెబ్బెన : దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం సింగరేణిలో నే కారుణ్య నియామకాల అమలు చేస్తున్నటువంటి ఘనత కారణజన్ముడు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిద్వారానే సాధ్యమైందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీ మల్రాజు శ్రీనివాస రావు అన్నారు. గురువారం బెల్లంపల్లి ఏరియా గోలేటి లోని GM ఆఫీస్ పరిధిలో ఏర్పాటుచేసిన ద్వారా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ కోల్ ఇండియా పరిధిలో మరియు ఏ ఇతర సంస్థలో లేనన్ని సౌకర్యాలను కెసిఆర్ గారు సింగరేణి కార్మికులకు అందించారని అన్నారు. ముఖ్యంగా కారుణ్య నియామకాలు సకల జనుల సమ్మె తెలంగాణ ఇంక్రిమెంటు ఉచిత విద్యుత్ ఉచిత ఏసీలు అమర్చుకుంటే ఉచిత విద్యుత్ 10 లక్షల గృహ రుణ పై వడ్డీ మాఫీ ,తల్లిదండ్రులకు కు కార్పొరేట్ వైద్య సౌకర్యం ఇలాంటి ఎన్నో వరాలు ప్రకటించిన ఘనత కేసీఆర్ది అని అన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు మరియు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో హక్కులు సాధించడం జరిగింది అన్నారు ముఖ్యంగా క్యాడర్ స్కీమ్ మెరుగుపరచడం రెండవ డెలివరీ ఉచితం PME కి వెళితే మాస్టర్ క్రీడాకారులకు ఆన్ డ్యూటీ బెల్లం పెల్లి ఏరియాలో కార్మికులకు ఉచిత బస్సు సౌకర్యం ఓపెన్ కాస్ట్ లో పని వేళల మార్పు ఇలాంటి ఎన్నో పనులను సాధించినట్టు ఆయన తెలిపారు కేవలం కెసిఆర్ మరియు ప్రజాప్రతినిధులు టీబీజీకేఎస్ యూనియన్ వల్లనే ఇవన్నీ సాధ్యం అయ్యిందని అన్నారు. రానున్న రోజులలో మరిన్ని హక్కులు సాధించ నున్నట్లు తెలిపారు. టీబీజీకేఎస్ కార్మికులకు అందుబాటులో ఉండి నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ కార్యాలయ కార్యదర్శి లక్ష్మీనారాయణ ఏరియా కార్యదర్శి రాజు జిఎం కమిటీ మెంబర్లు చంద్రశేఖర్ సమ్మయ్య ఖైరి గూడ పిట్ కార్యదర్శి కార్ నాదం వెంకటేష్ జి ఎమ్ ఆఫీస్ కమిటీ నెంబర్లు దేవేందర్ మంకయ్య నాగయ్య మరియు యు.జి ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment