రెబ్బెన : 18 ఏళ్ల వయస్సు రావడంతోనే వోటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని రెబ్బెన తాసిల్దార్ రియాజ్ అలీ అన్నారు. శనివారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి మానవహారాతో ఓటు హక్కు దుర్వినియోగం చేయొద్దని నోటుకు ఓటు అమ్ముకుని రౌడీ రాజకీయాల తీసుకురావద్దని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు వయోజనులు కాగానే విధిగా ఓటు హక్కునిపొంది మంచి నాయకున్ని ఎన్నుకొని అవినీతి రహిత సమాజాన్ని రూపుదిద్దాలని వారు విద్యార్థులకు సూచించారు. ఓటు హక్కు పొందిన తర్వాత స్వేచ్ఛగా దానిని ఉపయోగించుకోవాలని,డబ్బులకు,మందు విందులకు ఓటును అమ్ముకోవడం నేరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఉపాతాసిల్దార్ పిట్టల సరిత, హెచ్ఎం స్వర్ణలత, రెవిన్యూ కార్యాల ఉద్యోగులు ఊర్మిళ, మల్లేష్, లక్మి నారాయణ , శ్రీనివాస్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment