Wednesday, 26 February 2020

శివాలయం జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఆడిషల్ ఎస్పీ స

రెబ్బెన : మండలం నంబాల శ్రీ ప్రసన్న పరమేశ్వర శివాలయం జాతర ఏర్పాట్లను గురువారం  ఆడిషల్ ఎస్పీ సుదీద్ర పరిశీలించరు. గురువారం నుండి శనివారం వరకు జరుగు జాతరకు ముందస్తుగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా సిసి కెమెరాలు,లైటింగ్,  తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ  సందర్శనలో డిఎస్పీ సత్యనారాయణ, ఎస్ఐ దీకొండ రమేష్,సర్పంచ్ చెన్న సోమశేఖర్, వైస్ ఎంపిపి గజ్జెల సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ గజ్జెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ గాంధార్ల అశోక్,కమిటీ సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment