Wednesday, 26 February 2020

సి.హెచ్.పి, బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు స్కిల్ల్డ్( వేతనాలు చెల్లించాలి.*

 రెబ్బెన : సింగరేణిలోని బెల్లంపెల్లి ఏరియాలో  గత 15 సంవత్సరాల నుంచి బెల్ట్ క్లీనింగ్ మరియు సి.హెచ్.పి లలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారందరికీ ఎలాంటి షరతులు లేకుండా స్కిల్ల్డ్ (Skilled) వేతనాలు చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం జి.ఎం.కొండయ్య కు వినతిపత్రం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అందజేసారు, అనంతరం ఆయన మాట్లాడుతూ  కాంట్రాక్టు కార్మికులు  చాలి చాలని వేతనాలు తీసుకుంటూ ఏరియాకు లాభాలు రావడంలోను,ఏరియా అభివృద్ధి చెందడంలోను అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు, ఇండ్ల కిరాయి కట్టలేక,పిల్లలను మంచి చదువులు చదివించలేక ఎన్నో కష్టాలు, తిప్పలు పడుతున్నారని, అలాగే కార్మికులు గాని వారి పిల్లలు గాని అనారోగ్యానికి గురైతే హాస్పిటల్ తీసుకువెళ్లలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు, ఈ కార్యక్రమంలో గోలేటి బ్రాంచి కార్యదర్శి చళ్లూరి అశోక్, సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్,ఆర్గనైజింగ్ కార్యదర్శి పార్వతి సాయి కుమార్, నాయకులు శంకర్,తిరుపతి, ఆషాలు,లతోపాటు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment