రెబ్బెన : భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జన్మది పురస్కరించుకొని శుక్రవారం రెబ్బెన మండలం నక్కల గూడా ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కలవల శంకర్ రమాబాయి చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అంబేద్కర్ గారి ప్రతి విజయంలోనూ ఆమె తోడుగా నిలబడిందని తెలియజేశారు ఆమెకు చదువు రాకున్నా అంబేద్కర్ చదువు నేర్పించడం జరిగింది. అంబేద్కర్ చదువుతో ఉద్యమాలతో బిజీగా ఉండటం వలన కుటుంబ బాధ్యత అంతా ఆమె చూసుకోవాల్సి వచ్చేది ఎంతోమంది మహిళలకు ఆదర్శప్రాయులు రమాబాయి అంబేద్కర్ అని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది.
No comments:
Post a Comment