రెబ్బెన : స్టాండ్ ఫర్ నేషన్ పోస్టర్లను రెబ్బెన మండల యూత్ ఆధ్వర్యంలో లో బుధవారం ఎస్సై రమేష్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాదులు బాంబు దాడిలో చనిపోయిన జవాన్ల ఆత్మశాంతి కోసం ఈ నెల 14న స్టాండ్ ఫర్ నేషన్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ బి అతిథి గృహం దగ్గర్నుంచి ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ శ్రీనివాస్ ప్రవీణ్ మహేష్ సుధాకర్ మనోజ్ భీమేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment