రెబ్బెన : బెల్లంపల్లి ఏరియా బొగ్గు అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో గోలేటి ప్రాంతంలో అన్వేషణ చేస్తున్న డ్రిల్స్ ప్రాంతాన్ని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీ మల్రాజు శ్రీనివాస రావు సందర్శించారు. సౌకర్యాలపై గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో అన్వేషణ విభాగం యొక్క కృషి ఎనలేనిదని వారు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మారుమూల అటవీ ప్రాంతాలలో అన్వేషణ చేయవలసి ఉంటుందని కావున యజమాన్యం వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో లో టి బి జి కే స్ బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి జెరాజు అన్వేషణ విభాగం పిట్ కార్యదర్శి మైదం వీరస్వామి ఖైరిగుడా చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నర్సింగరావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment