రెబ్బెన : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మండల ఎంపిపి సౌందర్య ఆనంద్ జడ్పిటిసి సంతోష్ లు అన్నారు బుధవారం రెబ్బెన మండలం లోని రాజారం గ్రామంలో రోడ్లపై ఏర్పడిన గుంతలను మట్టితో పుడిపించారు. అలాగే వెల్కమ్ బోర్డులను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన పనులను వేగవంతంగా చేసి రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలను పల్లెలో పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. మండలం కోమరవేల్లి గ్రామ పంచాయతీలో మామిడి తిరుమాల్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలో నర్సారి మరియు రోడ్డు కి ఇరువైపుల పిచ్చిమొక్కలను మరియు సైడ్ డ్రైన్ పనులను అలాగే రెబ్బెన నంబరు ఇంద్రానగర్, గూడెం మాధవా గూడెం, నవగం తదితర గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment