రెబ్బెన : గ్రామాల అభివృద్ధిలొ భాగంగా సిసి రోడ్లు వేయడం జరుగుతుందని రెబ్బెన మండలం జడ్పిటిసి వెముర్ల సంతోష్, సర్పంచ్ బొమ్మినేని అహల్యా దేవిలు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఒకటో వార్డు లో డి ఎం ఎఫ్ టి నిధుల నుండి 5 లక్షల రూపాయల సీసీ రోడ్, సైడ్రన్ కు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ లోని ప్రతి గ్రామ గ్రామాలలో అభివృద్ధి పనులు తెరాస ప్రభుత్వం హయాంలోనే జరుగుతున్నాయని సీసీ రోడ్డులతొ ప్రజలకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మ డ్డీ శ్రీనివాస్, MPTC పెసరి మధునయ్య, కొఅప్శన్ సభ్యులు జాహూర్ వార్డు సభ్యులు రాచకొండ సత్తామ్మ TRS సీనియర్ నాయకులు పల్లె ప్రకాశ్ రావ్ బొమ్మినేని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment