- 31 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రెబ్బెన మండలం లో అవగాహన కార్యక్రమం, ర్యాలీ, మానవహారం
- రెబ్బెన : రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి 31 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు అన్నారు. బుధవారం రెబ్బెన మండలం లోని ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించి మానవహారం తో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆటో ట్రాలీ డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు నివారించడానికి కావలసిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ క్రమానికి కి ముఖ్య అతిథిగా ఎస్ఐ దీకొండ రమేష్ హాజరై మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు కు ద్విచక్ర వాహనాలు ఆటోడ్రైవర్లు తమ వంతు బాధ్యతగా వాహనాలను నడపాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలను నడప వద్దని సూచించారు. అనేక ట్రాఫిక్ నిబంధనలు సంస్కరణలు అమలు చేయడంతో గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అన్నారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కవిత, సంతోఫమార్, మోటార్ వెహికల్ కానిస్టేబుల్ వజిత్ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు బొంగు నర్సింగరావు. ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 26 February 2020
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నిబంధనలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment