రెబ్బెన : సింగరేణి కార్మికులకు ఎల్లప్పుడూ అండగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాత్రమే ఉంటుందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు శ్ర మల్రాజు శ్రీనివాసరావు అన్నారు. సోమవారం బెల్లం పెల్లి ఏరియాలో ని ఖైరిగుడా ఓపెనె కాస్ట్ లో నూతనంగా నిర్మించిన టీబీజీకేఎస్ జెండాను ఆవిష్కరించారు అనంతరంం ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు కెసిఆర్ ఎన్నో హక్కులు ప్రసాదించారని టీబీజీకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ వెంకట రావు , రాజిరెడ్డి కృషితో ముఖ్యంగా మాజీ పార్లమెంటు సభ్యురాలు కవితక్క ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ్యులు శాసనమండలి సభ్యుల సహకారంతో సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు తీసుకరావడం జరిగిందని అన్నారు . సింగరేణికార్మికులకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు గని స్థాయిలో మరియు ఏరియా స్థాయిలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను తీర్చడం జరుగుతుంది అని కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఖైరిగూడలో జరిగింది ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంఘం ప్రకాశరావు ఏరియా కార్యదర్శులు రాజు పసుల శంకర్ జిఎం కమిటీ సభ్యులు మారిన వెంకటేష్ మాంతు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment