రెబ్బెన : గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గంగాపూర్ జాతర లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆడిషల్ ఎస్పీ సుదీద్ర అన్నారు మంగళవారం ఆలయ ప్రాంగణం జాతర జరుగు ప్రదేశాలను పరిశీలించారు. శనివారం నుండి సోమవారం వరకు జరుగు జాతరకు ముందస్తుగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించి గంగాపూర్ జాతరలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా సిసి కెమెరాలు,లైటింగ్, ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,జాతర అయ్యేవరకు తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సందర్శనలో డిఎస్పీ సత్యనారాయణ, సిఐ అశోక్,ఇంచార్జ్ ఎస్ఐ రామారావు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment