Thursday, 27 February 2020

కుట్టు శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

రెబ్బెన : ప్రధాన మంత్రి కౌశల్ యోజన పథకం లో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ యువతకు మహిళల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ గురువారం తెలిపారు.    ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 4వ తేదీ లోపు పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డ్, పత్రలు  అందించాలని తెలిపారు.  పూర్తి వివరాలకు 8688769787, 9391436813, 9949116753 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.


పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి

రెబ్బెన : చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు ఆ చిన్న వయసులోనే దేశ స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు  చేశారని   నక్కల గూడా ప్రాథమిక పాఠశాల కల్వల శంకర్  అన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకొని రెబ్బెన మండలం నక్కల గూడా ప్రాథమిక పాఠశాలలో ఆయన చిత్రపటానికి  విద్యా కమిటీ వైస్ చైర్మన్ చౌదరి లక్ష్మీ గారు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పాఠశాల  మాట్లాడుతూ భారత దేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్లలో ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు అలాంటి వారిలో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు ఆ చిన్న వయసులోనే దేశ స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశాడు భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్ గురు లాంటి వారితో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను ప్రారంభించారు  ఆయన పోరాటం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం విద్యార్థులు చిన్నప్పటినుండి  దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులు ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

కెసిఆర్ తోనే సింగరేణి కార్మికులకు హక్కులు

 రెబ్బెన : దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం సింగరేణిలో నే కారుణ్య నియామకాల అమలు చేస్తున్నటువంటి ఘనత కారణజన్ముడు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిద్వారానే  సాధ్యమైందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీ మల్రాజు శ్రీనివాస రావు అన్నారు.  గురువారం  బెల్లంపల్లి ఏరియా గోలేటి లోని GM ఆఫీస్ పరిధిలో ఏర్పాటుచేసిన ద్వారా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ కోల్ ఇండియా పరిధిలో మరియు ఏ ఇతర సంస్థలో లేనన్ని సౌకర్యాలను కెసిఆర్ గారు సింగరేణి కార్మికులకు అందించారని అన్నారు. ముఖ్యంగా కారుణ్య నియామకాలు సకల జనుల సమ్మె తెలంగాణ ఇంక్రిమెంటు ఉచిత విద్యుత్ ఉచిత ఏసీలు అమర్చుకుంటే ఉచిత విద్యుత్ 10 లక్షల గృహ రుణ పై వడ్డీ మాఫీ ,తల్లిదండ్రులకు కు కార్పొరేట్ వైద్య సౌకర్యం ఇలాంటి ఎన్నో వరాలు ప్రకటించిన ఘనత కేసీఆర్ది అని అన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు మరియు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో హక్కులు సాధించడం జరిగింది అన్నారు ముఖ్యంగా క్యాడర్ స్కీమ్ మెరుగుపరచడం రెండవ డెలివరీ ఉచితం PME కి వెళితే మాస్టర్ క్రీడాకారులకు ఆన్ డ్యూటీ బెల్లం పెల్లి ఏరియాలో కార్మికులకు ఉచిత బస్సు సౌకర్యం ఓపెన్ కాస్ట్ లో పని వేళల మార్పు ఇలాంటి ఎన్నో పనులను సాధించినట్టు ఆయన తెలిపారు కేవలం కెసిఆర్ మరియు  ప్రజాప్రతినిధులు టీబీజీకేఎస్ యూనియన్ వల్లనే ఇవన్నీ సాధ్యం అయ్యిందని అన్నారు. రానున్న రోజులలో మరిన్ని హక్కులు సాధించ నున్నట్లు తెలిపారు. టీబీజీకేఎస్ కార్మికులకు అందుబాటులో ఉండి నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ కార్యాలయ కార్యదర్శి లక్ష్మీనారాయణ ఏరియా కార్యదర్శి రాజు జిఎం కమిటీ మెంబర్లు చంద్రశేఖర్ సమ్మయ్య ఖైరి గూడ పిట్ కార్యదర్శి కార్ నాదం వెంకటేష్ జి ఎమ్ ఆఫీస్ కమిటీ నెంబర్లు దేవేందర్ మంకయ్య నాగయ్య మరియు యు.జి  ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నంబాల గ్రామ పంచాయతీ లో జనరల్ బాడీ సమావేశం

 రెబ్బెన : నంబాల గ్రామ పంచాయతీ లో జనరల్ బాడీ సమావేశంని సర్పంచ్ చెన్న సోమశేఖర్  అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి పనుల గురించి చర్చించడం జరిగిందని తలిపాారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జి అశోక్ వార్డు సభ్యులు కె ఇంద్రసేనగౌడ్ సంజుకుమార్ జైస్వాల్ కె మధుకర్ ఆర్ భూదేవి బీ రజిత కె చిలుకమ్మ డి పద్మ పంచాయతీ సెక్రెటరీ శివ కృష్ణ గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 26 February 2020

కళాశాలకు మంచిపేరు తేవాలి : జడ్పిటిసి వేముర్ల సంతోష్



 రెబ్బెన : అధ్యాపకులకు కళాశాలకు పేరు తెచ్చేలా విద్యార్థుల ప్రవర్తన ఉండాలని రెబ్బెన జెడ్పిటిసి వేముర్ల సంతోష్ అన్నారు. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన కళాశాల వార్షిక దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ చాలా ముఖ్యమైనదనన్నారు. ఈ దశలో తీసుకున్నన నిర్ణయాలు భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని అన్నారు ఈ దశలో తీసుకున్నన నిర్ణయమే భవిష్యత్తును బంగారుబాట గా మార్చితుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం కూడా మధ్యాహ్నన భోజన కార్యక్రమం అమలుు చేయడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు.   మాట్లాడుతూ విద్యార్థులకు క్రమం తప్పకుండా అన్ని రకాల అంశాలలో చేయూత అందించామన్నారు. విద్యార్థులు రానున్నన పరీక్షల్లో ప్రతిభ కనబర్చి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అంతకు విద్యార్థులుు మాట్లాడుతూ కళాశాలతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.  కళాశాల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ముఖ్య అతిథులను విద్యార్థులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో  మరో ముఖ్య అతిథి జూనియర్ లెక్చరర్ అస్మత్,కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, కళాశాల అధ్యాపకులు సతీష్ ఇతర అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.


బేసిక్ వెంటనే సరి చేయాలి


  రెబ్బెన :   ఖైరి గూడ ఓపెన్ కాస్ట్ లో  పని చేస్తున్నా సర్ఫేస్ జనరల్ మజ్దూర్  లు కొందరికి బేసిక్ లో కోత విధించిన దాన్ని తిరిగి సరిచేయాలని  ఖైరిగుడా గాని మేనేజర్ శ్రీ ఉమా కాంత్ గారికి వినతి పత్రం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీ మల్రాజు శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది .ఈ సందర్భంగా  గా శ్రీనివాస రావు  మాట్లాడుతూ కొంతమంది జెనరల్ మాజదుర్లు  ఇతర ఏరియాల నుండి  బెల్లంపల్లి ఏరియకు పోస్టింగ్ ఇచ్చారు కానీ వారికి ఉన్న బేసిక్ ను తగ్గించడం జరిగింది అని   కానీ ఇతర కొన్ని ఏరియాలలో బేసిక్ తగ్గించకుండా నే   సర్ఫేస్ జనరల్ మజ్దూర్ గా  ఇచ్చారని అదేవిధంగా బెల్లంపల్లి ఏరియా లో కూడా సరిచేయాలని డిమాండ్ చేశారు .
సింగరేణిలో అన్ని ఏరియాలలో ఒకే విధంగా ఉండాలి కానీ ఏరియాకు ఒక విధంగా బేసిక్ ను అమలు చేయడం సరికాదన్నారు వెంటనే తగ్గించిన బేసిక్ సరి చేయనట్లయితే ఖైరిగుడా ఓపెన్ కాస్ట్ లో ఉత్పత్తి నిలిపివేయడానికి కోసం ధర్నా కార్యక్రమం చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. వెంటనే బెల్లంపల్లి ఏరియా యాజమాన్యం కార్పొరేట్ వారితో మాట్లాడి తగ్గించిన బేసిక్ ను సరి చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ ప్రకాష్ రావు ఏరియా కార్యదర్శి రాజు జిఎం కమిటీ మెంబర్ మారిన వెంకటేష్ ఏరియా నాయకులు నర్సింగరావు  భాస్కరచారి బొంగు వెంకటేష్ పిట్ కార్యదర్శి కార్ణాతం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభమైన 7వ ఆర్థిక గణన (ఎకనామిక్ సర్వే)



రెబ్బెన :  జిల్లా పాలనధికారి ఆదేశాల మేరకు  7వ ఆర్థిక గణన   కార్యక్రమాన్ని  బుధవారం రెబ్బెనమండలం లోని ఖైర్గం గ్రామా పంచాయితి లో డిజిటల్ సేవ కేంద్రం నిర్వాహకుడు దుర్గం పవన్ కుమార్  ప్రారంభించినట్లు తెలిపారు.  ఈ ఆర్థిక గణన మొదటి సారిగా దేశవ్యాప్తంగా డిజిటల్ రూపంలో , మొబైల్ అప్లికేషన్ ద్వార నిర్వహిస్తున్నాట్లు  దీనికి గాను   ప్రజలు సహకరించి సమాచారం అందించాలన్నారు. ఎటువంటి ఆటంకాలు వాటిల్లకుండా సర్వే సజావుగాకొన సాగుతుంది అని తెలిపారు. సర్వే నమోదు కొరకు 12మంది ఎన్యుమరేటర్లు ఉన్నారని, ఏప్రిల్ నెలాఖరు వరకు రెబ్బెన మండలం పూర్తిగా సర్వే చేస్తామని చెప్పారు. కేవలం రెబ్బెన మండలం మాత్రమే కాకుండా , జిల్లా వ్యాప్తంగా కూడా సర్వే జరుగుతుందని  అన్నారు

పోషణ అభియాన్ సమీక్ష సమావేశం

  రెబ్బెన.  : మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పోషణ అభియాన్   ఆధ్వర్యంలో మండల క సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జెడ్ పి టి సి వేముల సంతోష్ ఎంపీపీ సౌందర్య పాల్గొన్నారు ఈ సమావేశంలో మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యం ఉంటుందని అధికారులకు సూచించారు తల్లి బిడ్డ సంరక్షణ పై పోషణ వ్యక్తిగత పరిశుభ్రత అంగన్వాడి సేవలు గురించి చర్చించారు.  కార్యక్రమంలో లో ఉప తాసిల్దార్ సరిత,  ఎమ్ ఈ ఓ వెంకటేశ్వర స్వామి, ఐసిడిఎస్ సూపర్వైజర్ తిరుపతమ్మ, సరోజిని దేవి,   మండల ఎంపీటీసీలు తదితర అధికారులు పాల్గొన్నారు.


కార్మికులకు అండగా టీబీజీకేఎస్ : మల్రాజు శ్రీనివాసరావు

రెబ్బెన : సింగరేణి కార్మికులకు ఎల్లప్పుడూ అండగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాత్రమే ఉంటుందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు శ్ర మల్రాజు శ్రీనివాసరావు అన్నారు. సోమవారం బెల్లం పెల్లి ఏరియాలో ని ఖైరిగుడా  ఓపెనె  కాస్ట్ లో నూతనంగా నిర్మించిన టీబీజీకేఎస్ జెండాను  ఆవిష్కరించారు అనంతరంం ఆయన మాట్లాడుతూ  సింగరేణి కార్మికులకు కెసిఆర్   ఎన్నో హక్కులు ప్రసాదించారని టీబీజీకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ వెంకట రావు , రాజిరెడ్డి  కృషితో ముఖ్యంగా మాజీ పార్లమెంటు సభ్యురాలు కవితక్క ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ్యులు శాసనమండలి సభ్యుల సహకారంతో సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు తీసుకరావడం జరిగిందని అన్నారు . సింగరేణికార్మికులకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు గని స్థాయిలో మరియు ఏరియా స్థాయిలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను తీర్చడం జరుగుతుంది అని కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు.  ఈ సందర్భంగా ఖైరిగూడలో  జరిగింది ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంఘం ప్రకాశరావు ఏరియా కార్యదర్శులు రాజు పసుల శంకర్ జిఎం కమిటీ సభ్యులు మారిన వెంకటేష్ మాంతు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు పలు తీర్మానాలు

రెబ్బెన : రెబ్బెన గ్రామా పంచాయతీలో సర్పంచ్ బొమినేని అహల్య దేవీ అధ్యక్షతన  జనరల్ బాడీ సుమావేశం  సోమవారం  నిర్వహించారు.  అభివృద్ధి కొరకు  పలు అంశాలని చేర్చించి  కొత్త అభివృద్ధి పనులకు తీర్మానలు చేశారు. సేవాలాల్ జయంతి సందర్భంగా చెట్లను నాటారు సమావేశంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్ ఉప సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ mptc పెసరి మాధనయ్య వార్డు సబ్యలు

హెల్మెట్ తప్పకుండా ధరించాలి : ఎసై దీకోండ రమేష్

రెబ్బెన : వాహనదారులు  ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ  తూ  హెల్మెట్ ప్పకుండా ధరించాలని ఎసై దీకోండ రమేష్  సూచించారు ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో ద్విచక్ర వాహనదారులకు హైల్మేట్ పై అవగాహన కర్యక్రమన్ని  నిర్వహించారు .  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హైల్మేట్ తప్పనిసరిగా దరించాలని ప్రయాణం చేసేటప్పుడు  ప్రణనికి రక్షణగా ఉండి  ప్రణాలను కపడుతుందని అన్నారు అలాగే పాటిస్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. వీరితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాల పరిశుభ్రతకు ట్రాక్టర్లను వినియోగించుకోవాలి

   రెబ్బెన :  గ్రామ పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లను పూర్తిస్థాయిలో పరిశుభ్రతకు వినియోగించాలని  జిల్లా జెడ్ పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ  అన్నారు.  శనివారం  మండలంలోని  తక్కలపల్లి, రోళ్లపాడు, పులికుంట, రాజారాం,ఇందిరానగర్  గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరంం ఆమె మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమలు ప్రజలకు ఉపయోగపడేల ఉంటాయని.ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని ఈ యొక్క ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కె దక్కుతుందని అన్నారు ఈయొక్క గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను ఉపయోగించి గ్రామ పంచాయతీ ని అభివృద్ధి పధంలో తీసుకెళ్ళాలని సూచించారు ఈ కార్యక్రమంలో  డి పి ఓ రమేష్, జడ్పీటీసీ సంతోష్,ఎంపీటీసీ సంగం శ్రీనివాస్,సర్పంచులు పోషమల్లు, రాజా లక్మి,మల్లేష్, హన్మక్క,trs కార్యకర్తలు ఆనంద్,సుదర్శన్ గౌడ్,శ్రీధర్, ప్యాక్స్ చైర్మన్ సంజీవ్ కుమార్ ఉప సర్పంచులు   పాల్గొన్నారు.

శివాలయం జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఆడిషల్ ఎస్పీ స

రెబ్బెన : మండలం నంబాల శ్రీ ప్రసన్న పరమేశ్వర శివాలయం జాతర ఏర్పాట్లను గురువారం  ఆడిషల్ ఎస్పీ సుదీద్ర పరిశీలించరు. గురువారం నుండి శనివారం వరకు జరుగు జాతరకు ముందస్తుగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా సిసి కెమెరాలు,లైటింగ్,  తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ  సందర్శనలో డిఎస్పీ సత్యనారాయణ, ఎస్ఐ దీకొండ రమేష్,సర్పంచ్ చెన్న సోమశేఖర్, వైస్ ఎంపిపి గజ్జెల సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ గజ్జెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ గాంధార్ల అశోక్,కమిటీ సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చత్రపతి శివాజీ జన్మదిన వేడుకలను

రెబ్బెన : చత్రపతి శివాజీ 390 వ  జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రెబ్బెన మండలంలో పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. రెబ్బెన, నక్కల గూడ, కొండపల్లి,  వనుకులం, నవగం, లక్ష్మీపూర్, గగాపూర్, నంబల గోలేటి వివిధ గ్రామాలలో మరాఠా యోధుడు  ఈ సందర్భంగా గ్రామంలో జెండా గద్దె ఏర్పాటు చేసి చత్రపతి శివాజీ  చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం  జెండాను   ఎగరవేశారు.   గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ చత్రపతి శివాజీ యుద్ధ తంత్రాలు లోనే కాకుండా పరిపాలనా విధానంలో కూడా భారతదేశంలో అగ్రగణ్యుడు అని తెలియజేశారు ప్రజలకోసమే ప్రభువు అనే సిద్ధాంతాన్ని నమ్మి ప్రజల సంక్షేమం సంక్షేమం కోసం పాటు పడ్డారు మహిళలను పసివాళ్లను గౌరవించే వాడు శివాజీ అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు. ఈ కార్యక్రమంలో  సర్పంచులు శ్యామ్ రావు, శ్రీనివాస్, లలిత, మాధవి   నక్కలగూడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్, గ్రామ పెద్దలు దుర్గాదాస్ నాగయ్య ఏ మాజీ హోసన్నా బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

మోకు దెబ్బ జన జాతరను విజయవంతం చేయాలి

రెబ్బెన :   చలో  గౌడ మోకు దెబ్బ జన జాతర.. తేదీ 2 న హైదరాబాద్ రవీంద్రభారతిలో  జరిగే సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు. బుధవారం రెబ్బెన మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చలో  గౌడ మోకు దెబ్బ జన జాతర సంబంధించిన వాల్ పోస్టర్లలను విడుదల చేసరు. అనంతరం మాట్లాడుతూ  గీత కార్మికులను గుర్తించిి లైసెన్స్, ప్రమాద భీమాను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి జరిగిన నెలలోపే ఎలాంటి షరతులు లేకుండా అందించాలన్నారు. సమస్యల పెె నిర్వహించు సభను విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి గౌడ్. జిల్లా కార్యవర్గ సభ్యులు మడిపల్లి లక్ష్మీనారాయణ గౌడ్ గుడిసెల వెంకటేశ్వర గౌడ్ తాళ్లపల్లి ప్రభాకర్ గౌడ్. మండల ఉపాధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సి.హెచ్.పి, బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు స్కిల్ల్డ్( వేతనాలు చెల్లించాలి.*

 రెబ్బెన : సింగరేణిలోని బెల్లంపెల్లి ఏరియాలో  గత 15 సంవత్సరాల నుంచి బెల్ట్ క్లీనింగ్ మరియు సి.హెచ్.పి లలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారందరికీ ఎలాంటి షరతులు లేకుండా స్కిల్ల్డ్ (Skilled) వేతనాలు చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం జి.ఎం.కొండయ్య కు వినతిపత్రం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అందజేసారు, అనంతరం ఆయన మాట్లాడుతూ  కాంట్రాక్టు కార్మికులు  చాలి చాలని వేతనాలు తీసుకుంటూ ఏరియాకు లాభాలు రావడంలోను,ఏరియా అభివృద్ధి చెందడంలోను అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు, ఇండ్ల కిరాయి కట్టలేక,పిల్లలను మంచి చదువులు చదివించలేక ఎన్నో కష్టాలు, తిప్పలు పడుతున్నారని, అలాగే కార్మికులు గాని వారి పిల్లలు గాని అనారోగ్యానికి గురైతే హాస్పిటల్ తీసుకువెళ్లలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు, ఈ కార్యక్రమంలో గోలేటి బ్రాంచి కార్యదర్శి చళ్లూరి అశోక్, సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్,ఆర్గనైజింగ్ కార్యదర్శి పార్వతి సాయి కుమార్, నాయకులు శంకర్,తిరుపతి, ఆషాలు,లతోపాటు తదితరులు పాల్గొన్నారు

కష్టపడి పనిచేయాలి కొండయ్య

రెబ్బెన :  బెల్లంపల్లి ఏరియా ఆలయంలో సోము ఉద్యోగ ఉద్యోగ పత్రాలు అందజేశారు పెట్టు నలుగురికి ఉద్యోగం నలుగురికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి పేరు తీసుకురావాలని సత్వరమే కార్మికులు మాజీ కార్మికులకు కార్మికుల సమ్మె కార్మికులు వ్యక్తం చేశారు కొత్త జిల్లాలు కార్యక్రమంలో యోహాను యోహాను మోహన్ మోహన్ మోహన్ అశోక్ కుమార్ లక్ష్మణరావు లక్ష్మణరావు గోపి కృష్ణ నిరంజన్ బాబు విశ్రాంతి విశ్రాంతి కుమార్ కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలకు తరలిరండి

రెబ్బెన : ఫిబ్రవరి 22 నుండి 24 వరకు మంచిర్యాలలో జరుగు సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలకు తరలిరావాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతి,సీపీఐ మండల కార్యదర్శి దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాలను గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్లో విడుదల చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. దున్నేవాడికె భూమి దక్కాలని ఎన్నో వీరోచిత పోరాటాలు నిర్వహించి భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నరసయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి జగ్గయ్య, గోలేటి పట్టణ కార్యదర్శి మారం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కస్తూరి రవికుమార్,ఎ.ఐ.వై.ఎఫ్. జిల్లా సహాయ కార్యదర్శి రహీం,ఎ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా ఉపాధ్యక్షుడు పుదరి సాయి, డివిసన్ కార్యదర్శి పర్వతి సాయి,చారి పాల్గొన్నారు.

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

రెబ్బెన : సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రెబ్బెన   ఎంపీ సంతోష్‌ కుమార్‌ మొక్కలను నాటారు. బంగారు తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేపట్టని చేపట్టని మహోన్నత  సంక్షేమ  కార్యక్రమా లను మన ముఖ్యమంత్రి చేపట్టారని అన్నారు.  అలాగే ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా చేతులు దాటి హరిత తెలంగాణ కు కృషిచేయాలని అని కోరారు ఈ కార్యక్రమంలో లో ఎంపీపీ సౌందర్య,సర్పంచ్ అహల్యాదేవి, fro పూర్ణిమ, trs నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలకు తరలిరండి

రెబ్బెన : ఫిబ్రవరి 22 నుండి 24 వరకు మంచిర్యాలలో జరుగు సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలకు తరలిరావాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతి,సీపీఐ మండల కార్యదర్శి దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాలను గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్లో విడుదల చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. దున్నేవాడికె భూమి దక్కాలని ఎన్నో వీరోచిత పోరాటాలు నిర్వహించి భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నరసయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి జగ్గయ్య, గోలేటి పట్టణ కార్యదర్శి మారం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కస్తూరి రవికుమార్,ఎ.ఐ.వై.ఎఫ్. జిల్లా సహాయ కార్యదర్శి రహీం,ఎ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా ఉపాధ్యక్షుడు పుదరి సాయి, డివిసన్ కార్యదర్శి పర్వతి సాయి,చారి పాల్గొన్నారు.

చెట్లను నాటుదాం కాలుష్యాన్ని నివారిద్దాం

 రెబ్బెన:  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని  నివారించాలని డిఎస్పి సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆయన చెట్లను  నాటారు. అనంతరం మాట్లాడుతూ చెట్లను నాటడమే కాకుండా వాటిని పోషణ బాధ్యత అందరూ మీద ఉంటుందన్నారు.  ఒక ఛాలెంజ్ గా తీసుకొని హరిత  వనాలను సృష్టించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జాకీర్ప్రిన్సిపల్ జాకీర్ ఉస్మానీ రెబ్బెన సీఐ అశోక్ అధ్యాపకులు మల్లేష్ గణేష్ రమేష్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

సహకార ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు

  రెబ్బెన :సహకార సంఘాలు ఎన్నికలను శనివారం నిర్వహించగా ఎన్నికల్లో టిఆర్ఎస్ రెండు స్థానాల్లో పోటీ చేయగా రెండు స్థానాలలో టిఆర్ఎస్ విజయం సాధించింది మండలంలో మొత్తం 13 స్థానాలు కాగా 11 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కాగా రెండు స్థానాలు ఆరు ఏడు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో నిలబడి విజయం సాధించారు. ఆరవ వార్డు లో  వాడయి మొండి, ఏడవ వార్డులో కార్నాథం సంజు కుమార్ లు గెలుపొందారు ఈ సందర్భంగా తెరాస నాయకులు సంబరాలు జరుపుకున్నారు.

స్వయం ఉపాధి కొరకు దరఖాస్తుల ఆహ్వానం

రెబ్బెన :   చిన్న తరహా  పరిశ్రమల హైదరాబాద్సంస్థల్లో ఉపాధి కొరకు దరఖాస్తుల స్వీకరించ పడతాయని బెల్లంపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ లక్ష్మణ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏరియాలోని  భూనిర్వాసిత, పరిసర ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఆసక్తి గల అభ్యర్థులు  తమ ప్రావీణ్యం ఉన్న కోర్సులలో ఈనెల 29న బెల్లంపల్లి ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్లలో సంప్రదించాలని కోరారు.

వీర జవాన్లను స్మరిస్తూ ర్యాలీ

రెబ్బెన : గత ఏడాది  ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 40మంది వీర జవానుల ను స్మరిస్తూ"" i stand ఫర్ ద నేషన్ ""పేరుతో మరణించిన సైనికులకు  నివాళులు అర్పించే కార్యక్రమాన్ని  రెబ్బెన మండల యూత్ టీమ్ ఆధ్వర్యంలో లో లో శుక్రవారం ప్రధాన రహదారులపై విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి మౌనం పాటించారు. మండలం నక్కల కూడా ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించడరు.    వారు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ సురక్షితంగా సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికులే అలాంటి మన సైనికులపై దాడి జరగడం చాలా బాధాకరమైన విషయం వారి ఆత్మకు శాంతి కలగాలని అందరూ దేశభక్తిని పెంపొందించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు.

ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిగా రహీం

రెబ్బెన :   అఖిలభారత యువజన సమైక్య ఏ ఐ వై ఎఫ్ జిల్లా మహాసభలో గోలేటి గ్రామానికి చెందిన ఎండి రహీం ను జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం  ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన అఖిలభారత యువజన  సమైక్య సమావేశం లో ఎన్నుకున్నట్లు తెలిపారు. రహీం ఎన్నికపై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ , పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

డిజిటల్ సేవా పై అవగాహన

 రెబ్బెన :  తెలంగాణ గ్రామీణ బ్యాంక్  నాబార్డ్ వారు ఆధ్వర్యంలో డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సును గురువారం   రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై రుణాలపై ఇన్సూరెన్స్ వివిధ సదుపాయాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు అలాగే బ్యాంక్ ఖాతా యొక్క సమాచారం కొరకు సెల్ఫోన్ నుంచి మిస్డ్ కాల్ చేసి  9278031313 వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు  ఈ కార్యక్రమంలో లో ఎస్ఎంసి చైర్మన్ మదనయ్య సమాఖ్య అధ్యక్షురాలు తాను భాయి ఫీల్డ్ ఆఫీసర్ షేక్ హుస్సేన్   తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పరిశుభ్రతతో ప్రజల ఆరోగ్యం

  రెబ్బెన:.  గ్రామ అభివృద్ధి   స్వచ్ఛత పరిశుభ్రత  కొరకు పంపిణీ చేసిన ట్రాక్టర్లను  వినియోగించుకోవాలని  ఎంపీపీ జుమ్మిడి సౌందర్య ఆనంద్ అన్నారు.  బుధవారం మండలం లొని తుంగెడ గ్రామపంచాయతీలో ట్రాక్టర్ పంపిణీ చేసరు
అనంతరం మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు ఉండాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. తడి చెత్త ను పొడి చెత్త ను వేరు చేసి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డొంగ్రీ పెంటయ్య,ఉప సర్పంచ్ జంబుల సాయి కృష్ణ,పంచాయతీ కార్యదర్శి  వంశీ కృష్ణ, నాయకులు జుమీడి ఆనంద్,రమేష్,శంకర్,రవి,గ్రామస్థులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గం ఎంపిక

 రెబ్బెన: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శిగా బద్రి సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా తిరుపతి లను ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.మంగళవారం   గోలేటి లోని కె.ఎల్ మహేంద్ర భవన్లో జరిగిన సిపిఐ జిల్లా నిర్మాణ మహాసభలో   ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.  జిల్లా  కార్యవర్గ సభ్యులుగా దుర్గం రవీందర్, ఆత్మకూరి చిరంజీవి, ప్రకాష్, ఉపేందర్, లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

స్టాండ్ ఫర్ నేషన్ పోస్టర్ ఆవిష్కరణ

 రెబ్బెన :  స్టాండ్ ఫర్ నేషన్ పోస్టర్లను రెబ్బెన మండల యూత్ ఆధ్వర్యంలో లో బుధవారం ఎస్సై రమేష్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాదులు బాంబు దాడిలో చనిపోయిన జవాన్ల ఆత్మశాంతి కోసం ఈ నెల 14న స్టాండ్ ఫర్ నేషన్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ బి అతిథి గృహం దగ్గర్నుంచి ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ శ్రీనివాస్ ప్రవీణ్ మహేష్ సుధాకర్ మనోజ్ భీమేష్ తదితరులు పాల్గొన్నారు.



14న శివాలయం జాతర వేలం

రెబ్బెన:  శ్రీ ప్రసన్న పరమేశ్వర శివాలయం నంబాలలో  మూడు రోజులపాటు జరుగు శివరాత్రి మహోత్సవాలకు ,ప్లాట్స్, ప్రసాదం, కొబ్బరికాయలు, సైకిల్ టాక్స్, సంవత్సర దుకాణం తదితర వటీకి వేలంపాట ఈనెల 14న ఉదయం 10 గం"లకు  వేలంపాట వేయనున్నట్లు  ఆ కమిటీ  వారు తెలిపారు కావున  వేలంపాటలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు

నేడు సీపీఐ 2వ నిర్మాణం మహాసభ

 నేడు సీపీఐ 2వ నిర్మాణం మహాసభ
  రెబ్బెన :  భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 2వ నిర్మాణ మహాసభలు  మంగళవారం రోజున గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్ లో నిర్వహించడం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు S.తిరుపతి తెలిపారు.ఈ యొక్క మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గారు,మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవెన శంకర్, జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ హాజరవుతారని తెలిపారు. కావున జిల్లాలోని పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

ఏ ఐ వై ఎఫ్ రెబ్బెన మండల కమిటీ

రెబ్బెన :   అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రెబ్బెన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి తెలిపారు. మండల అధ్యక్షునిగా కస్తూరి రవికుమార్, ఉపాధ్యక్షునిగా సల్లా మహేష్, మండల కార్యదర్శిగా ముద్దసాని శ్రావణ్, సహాయ కార్యదర్శిగా ముంజ హరిదాస్, కోశాధికారిగా కుర్ర మహేష్ లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.


అత్యంత భక్తి శ్రద్దలతో స్వామివారి రథోత్సవం ఆనందోత్సాహాలతో జాతర

 రెబ్బెన: మాఘ శుద్ధ పౌర్ణమి సంధర్బంగా బుధవారం  నాడు కుమురం భీమ్ జిల్లా రెబ్బెన మండలం గంగపూర్ లో గల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామీ రధోత్సవం   భక్తజన సంద్రోహం మధ్య ఘనంగా జరిగింది. ప్రతి ఏట నిర్వహించే ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యాలో పాల్గొన్నారు.భక్తుల సౌకర్యర్ధం ధర్మ దర్శనము,ప్రత్యేక దర్శనము, విఐపి దర్శనములు ఏర్పాటు చేశారు. స్వామీ వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన  భక్తుల సౌకార్యార్ధం  కొంతమంది భక్తులు, వ్యాపారులు, కలసి  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా త్రాగునీటి సమస్య ఏర్పడకుండా వివిధ స్వచ్చంధ సంస్థలు,జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ ఆధ్వర్యంలో  త్రాగు నీరు అందించారు.. వైద్య ఆరోగ్య శాఖ మరియు రెబ్బెన ప్రభుత్వ వైద్య సిబ్బంది  ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. వ్యవసాయ శాఖ,అంగన్వాడీ వారి అద్వర్యం లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. జాతరకు హాజరైన భక్తులు మాట్లాడుతూ సౌకర్యాలను మరింత మెరుగు పరచాలని, గంగపూర్ ను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు.అదే విధంగా  రెబ్బెన నుండి గంగపూర్ వెళ్లే తారు రొడ్డును రెండు వరసల రహదారిగా నిర్మించాలని అన్నారు.జాతరలో ఏర్పాటు చేసిన జైంట్  వీల్ ,వివిధ ఆటలు భక్తులను ఆకట్టుకున్నాయి.జాతరలో ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ  సంఘటనలు,ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండ డిఎస్పీ సత్యనారాయణ  అద్వర్యంలో  పోలీస్ తో విధులు నిర్వహించారు.

నవేగామ్ లో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

రెబ్బెన : మండలం లోని నవేగామ్  గ్రామంలో అవులకు , గేదెలకు  ఉచితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను   శుక్రవారం  పశు వైద్య సిబ్బంది వెటర్నరీ డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో 146- ఆవులు 6 - గేదెలు  వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవేగాం సర్పంచ్   వడాయి మాధవి, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గోలేటి కి చెందిన కేసరి అలేఖ్య కు నోబెల్ వరల్డ్ రికార్డులో స్థానం

  రెబ్బెన : ఈ నెల 2వ తేదీన బెంగళూరు లో నిర్వహించిన విశ్వ సంస్కృతిగా సంభ్రమ 2020లో రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన కేసరి అలేఖ్య గారికి నోబల్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది. ఆదివారం బెంగళూరులో వత్తురు 3g మందిరంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా 12 గంటల పాటు నిర్వహించిన సామూహిక సూర్యనమస్కారాల్లో పాల్గొన్నందుకు ఈ అవార్డు దక్కినట్లు యోగ ప్రచారసమితి రాష్ట్ర అధ్యక్షులు రేవెల్లి రాజలింగు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M. ప్రసాద్. రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేముల రమేష్. రాష్ట్ర కోచ్ బోయ ఉమా. జిల్లా ఇన్చార్జి కేసరి ఆంజనేయులు గౌడ్ అభినందనలు తెలిపారు.

రమాబాయి అంబేద్కర్ జన్మదిన వేడుకలు

 రెబ్బెన :   భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  సతీమణి రమాబాయి అంబేద్కర్  జన్మది పురస్కరించుకొని  శుక్రవారం    రెబ్బెన మండలం నక్కల గూడా ప్రాథమిక పాఠశాలలో   పాఠశాల ప్రధానోపాధ్యాయులు కలవల శంకర్     రమాబాయి  చిత్రపటానికి పూలమాల   వేశారు. అనంతరం  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ  అంబేద్కర్ గారి ప్రతి   విజయంలోనూ ఆమె తోడుగా నిలబడిందని తెలియజేశారు ఆమెకు చదువు  రాకున్నా అంబేద్కర్  చదువు  నేర్పించడం జరిగింది. అంబేద్కర్ చదువుతో ఉద్యమాలతో బిజీగా  ఉండటం వలన కుటుంబ బాధ్యత అంతా ఆమె చూసుకోవాల్సి వచ్చేది ఎంతోమంది మహిళలకు  ఆదర్శప్రాయులు రమాబాయి అంబేద్కర్  అని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది.

గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

రెబ్బెన : మండలం లోని కొండపల్లి  గ్రామంలో అవులకు , గేదెలకు  ఉచితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను  గురువారం  పశు వైద్య సిబ్బంది వెటర్నరీ డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో 146- ఆవులు 11 - గేదెలు  వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి సర్పంచ్ - వడాయి శాంత, MPTC - మోర్లే రఘుపతి పాల్గొన్నారు.

జీపి కార్మికులను శ్రమదోపిడికి గురిచేస్తున్న ప్రభుత్వం ; ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్

రెబ్బెన :     గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీ గురిచేసిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు, బుధవారం రోజున గ్రామ పంచాయితీ కార్మికులకు GO నెంబర్ 51 ప్రకారం 8500 వేతనాలు 010 ట్రెసరి ద్వారా ఇవ్వాలని డిమాండ్  చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెబ్బన ఎంపీడీఓ కార్యాలయం ధర్నా  చేశారు,అనంతరం ఎం.పీ.ఓ అంజత్ పాషాకు వినతిపత్రం ఇచ్చారు,అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడారు .గత 20 సంవత్సరాల నుంచి చాలి చాలని వేతనాలు తీసుకుంటూ,గ్రామ పంచాయితీలు అభివృద్ధి చెందడంలోను,పరిశుభ్రత పరచడం లోను అత్యంత కీలకమైన పాత్ర పోషించిస్తున్నారని అన్నారు,కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని, అలాగే కనీస వేతనం 21 వేలు ఇవ్వాలని,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐడెంటిటీ కార్డ్ ,ఈ.ఎస్.ఐ,పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలని, కారొబార్లను పంచాయతీ కార్యదర్సులుగా గుర్తించాలని,ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ శంకర్,ప్రకాష్,నాయకులు మల్లయ్య,సుబ్బయ్య,లక్ష్మణ్,లతో పాటు తదితరులు పాల్గొన్నారు

గంగాపూర్ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

రెబ్బెన :   గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గంగాపూర్ జాతర లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని  ఆడిషల్ ఎస్పీ సుదీద్ర అన్నారు మంగళవారం  ఆలయ ప్రాంగణం జాతర జరుగు ప్రదేశాలను పరిశీలించారు. శనివారం నుండి సోమవారం వరకు జరుగు జాతరకు ముందస్తుగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించి గంగాపూర్ జాతరలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా సిసి కెమెరాలు,లైటింగ్, ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,జాతర అయ్యేవరకు తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ  సందర్శనలో డిఎస్పీ సత్యనారాయణ, సిఐ అశోక్,ఇంచార్జ్ ఎస్ఐ రామారావు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలు తరిమికొడదాం : మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్

  రెబ్బెన :  ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని    మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్,CPI జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ లు పిలుపునిచ్చారు. మంగళవారం రెబ్బెన రెబ్బెన మండలం లోని గోలేటి  సిపిఐ కార్యాలయంలో  మండల మూడవ నిర్మాణ మహాసబ లొ ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ నిత్యావసర సరుకులు   చుక్కలను అంటిన వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందయని అన్నారు. దేశంలో మతోన్మాదం పెంచే విధంగా BJP ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతి, మండల కార్యదర్శి నర్సయ్య, పట్టణ కార్యదర్శి జగ్గయ్య,AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,AITUC జిల్లా కార్యదర్శి ఉపేందర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి గణేష్, మహిళ సంఘం నాయకులు భీమక్క పాల్గొన్నారు.

గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

రెబ్బెన : మండలం లోని పులికుంట  గ్రామంలో అవులకు , గేదెలకు  ఉచితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను మంగళవారం  అం  పశు వైద్య సిబ్బంది వెటర్నరీ డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో 153 - ఆవులు 4 - గేదెలు  వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులికుంట సర్పంచ్  పోషమల్లు పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నేడు సిపిఐ మండల నిర్మాణ సభ

 రెబ్బెన : మండలం  లోని గోలేటి  ఏఐటీయూసీ భవనం లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు  సీపీఐ మండల నిర్మాణ సభ కార్యక్రమం నిర్వహించడం  జరుగుతుందని సీపీఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య  సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిలు గా సీపీఐ రాష్ట్ర కార్యదర్శ వర్గ సభ్యులు ( x mla ) గుండా మల్లేష్ , సీపీఐ కొమురం భీమ్ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ     హాజరుకానున్నారు. కావున పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  కోరారు.

అభివృద్ధి కొరకు సిసి రోడ్లు ప్రారంభం

రెబ్బెన :  గ్రామాల అభివృద్ధిలొ భాగంగా  సిసి రోడ్లు వేయడం జరుగుతుందని రెబ్బెన మండలం జడ్పిటిసి వెముర్ల సంతోష్,  సర్పంచ్  బొమ్మినేని అహల్యా దేవిలు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఒకటో వార్డు లో     డి ఎం ఎఫ్ టి నిధుల నుండి 5 లక్షల రూపాయల  సీసీ రోడ్,  సైడ్రన్ కు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ లోని ప్రతి గ్రామ గ్రామాలలో  అభివృద్ధి పనులు తెరాస ప్రభుత్వం హయాంలోనే జరుగుతున్నాయని  సీసీ రోడ్డులతొ   ప్రజలకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది  అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మ డ్డీ శ్రీనివాస్,   MPTC పెసరి మధునయ్య, కొఅప్శన్ సభ్యులు జాహూర్  వార్డు సభ్యులు రాచకొండ సత్తామ్మ TRS సీనియర్ నాయకులు పల్లె ప్రకాశ్ రావ్ బొమ్మినేని శ్రీధర్   తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ కార్మికులకు షరతులు లేకుండా వేతనలు చెల్లించాలి: బోగే ఉపేందర్

రెబ్బన : ప్రతి గ్రామ పంచాయితీ కార్మికులకు  షరతులు లేకుండా  సిబ్బందికి జి.ఓ. నెంబర్.51 ప్రకారం వేతనలు చెల్లించాలని  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు, ఆదివారం  రెబ్బన లోని ఆర్.అండ్ బి గెస్ట్ హౌస్ లో   మండలం ఏఐటీయూసీ గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిిగా హాజరై ఆయన మాట్లాడారు  గ్రామపంచాయతీ కార్మికులు  సుమారుగా 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ, నిత్యం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ,గ్రామాలు అభివృద్ధి చెందడం లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు, ,ప్రతి నెల 10 తేదీ లోపు 010 ట్రెసరి ద్వారా ఎలాంటి షరతులు విధించకుండా అందరికి 8500 రూపాయలు జీతాలు చెల్లించాలని అన్నారు,  ఈ సమావేశంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్,గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శంకర్,అన్నాజీ, కారోబర్లు మహేందర్,లక్ష్మణ్,దేవాజి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

గాలి కుంటు వ్యాధి టీకాలను వేయించాలి

రెబ్బెన    పశువులకు గాలి కుంటు  వ్యాధి టీకాలను వేయించాలని    రెబ్బెన సర్పంచ్ అహల్య దేవి అన్నారు.    శనివారం  మండలంలోని పుంజుమేరగుడా గ్రామంలో అవులకు , గేదెలకు  ఉచితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను మండల పశువైద్యాధికారి డాక్టర్ సాగర్  ఆధ్వర్యంలో పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలను వేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ తప్పని సరిగా టీకాలను పశువులకు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ - పుష్పాలత పశు వైద్య సిబ్బంది తదితర రైతులు పాల్గొన్నారు.

ఉద్యోగికి పదవి విరమణ సహజం

 రెబ్బెన ;  ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగరీత్యా పదవీ విరమణ సహజమని  రెబ్బన తహశీల్దార్ రియాజ్ అలీ అన్నారు. శుక్రవారం అంకితభావంతో  కార్యాలయంలో  సబార్డినెట్ పనిచేసి   రిటైర్మెంట్ అవుతున్న మహ్మద్ సర్వర్ ను  మండల తహసీల్దార్ రియాజ్ అలీ ,డిప్యూటీ తహసీల్దార్ సరితా ,మరియు రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ    అత్యంత అంకితభావంతో పనిచేసి  అందరి మన్ననలు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో  ఆర్.ఐ ఊర్మిల,జయరాం,  జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, విఆర్వోలు శిరీష ,దేవిక, సంతోష్ , గణపతి  , ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగె ఉపేందర్, రేషన్ డీలర్లు రామయ్య ,మురళి ,ప్రభాకర్, శంకర్ ,తదితరులు పాల్గొన్నారు

మహాత్మా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం

రెబ్బెన : మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని  నక్కల కూడా ప్రాథమిక పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్  అన్నారు గురువారం జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని  మండలం లోని నక్కల కూడా ప్రాథమిక పాఠశాల లో  ఆయన చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం  పాటించారు  అనంతరం మాట్లాడుతూ   భారత స్వాతంత్రోద్యమ పోరాటం లో మహాత్మా గాంధీ కీలక పాత్ర అని సత్యం మరియు అహింసను ఆయుధాలుగా  బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీయుడు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్  భీమ్రావు, గ్రామస్తులు శ్యామ్ రావు, విలాస్, హనుమంతు, పెంటయ్య ,అనిల్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

కుష్టు వ్యాధిపై అవగాహన

రెబ్బెన:  శరీరంపై ఎక్కడైనా  స్పర్శ లేకుండా తెల్లటి మచ్చలు  ఉంటే తక్షణమే వైద్య నిపుణులను  సంప్రదించాలని  పులి కుంట  ఉపా సర్పంచ్ మల్రాజ్ శృతి అన్నారు. గురువారం రెబ్బెన మండలంలోని పులి కుంట గ్రామంలో కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు  నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ  కలలు కన్న విధంగా  భవిష్యత్తులో కుష్టు వ్యాధి రహిత భారతదేశ నిర్మాణంలో అందరం కలిసి కృషిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ మైలారపు స్వరూప, అంగన్వాడి టీచర్ స్వప్న, గ్రామస్తులు మల్రాజ్  రాంబాబు, వెంకటేష్ రమేష్ ,కవిత తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం

రెబ్బెన :  కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో సింగరేణి, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ లు    పూర్తిగా విఫలమైందని  ఏ ఐ టి యూసి  బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి  అన్నారు.   గురువారం బెల్లంపల్లి ఏరియా సింగరేణి బొగ్గు బావుల వద్ద సంబంధిత డిపార్ట్మెంట్లలో వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన  కార్మికులను ఉద్దేశించి మాట్లాడాతు. కార్మికుల  న్యాయమైన సమస్యలను  యాజమాన్యం వెంటనే  పరిష్కరించాలన్నారు.  సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా రోజు రోజు సింగరేణిలో రాజకీయలు జోక్యం చేసుకుని సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో  బ్రాంచ్ ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి, ఆర్గనైజింగ్ కార్యదర్శి మారం శీను, నాయకులు ఎస్ రాజన్న, ముద్దసాని వెంకటేశం ,తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నిబంధనలు


  • 31 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రెబ్బెన మండలం లో అవగాహన కార్యక్రమం, ర్యాలీ, మానవహారం
  • రెబ్బెన : రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి 31 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు  అన్నారు. బుధవారం రెబ్బెన మండలం లోని ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించి మానవహారం తో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆటో ట్రాలీ డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు నివారించడానికి కావలసిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ క్రమానికి కి ముఖ్య అతిథిగా ఎస్ఐ    దీకొండ రమేష్ హాజరై మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు కు  ద్విచక్ర వాహనాలు ఆటోడ్రైవర్లు తమ వంతు బాధ్యతగా వాహనాలను నడపాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలను నడప వద్దని సూచించారు. అనేక ట్రాఫిక్ నిబంధనలు సంస్కరణలు అమలు చేయడంతో గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అన్నారు ఈ కార్యక్రమంలో  గురుకుల    పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి,  అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్  కవిత, సంతోఫమార్, మోటార్ వెహికల్ కానిస్టేబుల్ వజిత్ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు బొంగు నర్సింగరావు. ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

తెరాస తో గ్రామాల అభివృద్ధి

 రెబ్బెన : తెలంగాణ ప్రభుత్వం   లో గ్రామ గ్రామాలకు అభివృద్ధి పనులు జరుగుతాయని  రెబ్బెన ఎంపీపీ  జుమ్మిడి సౌందర్య ఆనంద్ అన్నారు.  మంగళవారం మండలంలోని  తుంగెడ గ్రామంలో   డి ఎం ఎఫ్ టి నిధుల నుండి 10 లక్షల రూపాయల  సీసీ రోడ్,  సైడ్రన్ కు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ లోని ప్రతి గ్రామ గ్రామాలలో అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు తెరాస ప్రభుత్వం హయాంలోనే జరుగుతున్నాయని zp చైర్మన్ కోవ లక్మి మేడం  కేటాయించిన సీసీ రోడ్డులతొ   ప్రజలకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది  అన్నారు. ఈ కార్యక్రమంలో  తుంగడ సర్పంచ్ పెంటయ్య, ఉప సర్పంచ్ సాయికృష్ణ, గోపాల్, మాజీ సర్పంచ్ భగవాన్, smc ఛైర్మన్ తిరుపతి,   నాయకులు డాక్టర్లు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ,, ఎమ్మెల్యే ఆత్రం సక్కు

రెబ్బెన  : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అని  ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం రెబ్బెన లో దుర్గం తిరుపతి  స్మారక క్రికెట్ పోటీలను   క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. అనంతరం  మాట్లాడుతూ గ్రామాల్లో యువకులు క్రీడలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఎవరైనా గెలిచినా ఓడినా స్నేహభావంతో ఉండాలని అన్నారు గ్రామాల్లో ఉన్న క్రీడాకారులకు తనవంతు సాయం ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ జుమ్మిడి సౌందర్య  ఆనంద్, జడ్పీటీసీ సంతోష్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, సర్పంచ్ ఆహల్యాదేవి. సోమశేఖర్, ఎంపీటీసీ మధునయ్య, చారి,trs కార్యకర్తలు, పాల్గొన్నారు.

మార్కండేయ జయంతి వేడుకలు

 రెబ్బన ;   శ్రీ  భక్త మార్కండేయ జయంతి వేడుకలను రెబ్బెన మండలం లోని గోలేటి లో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు. శ్రీ  భక్త మార్కండేయ  విశిష్టత గురించి వర్ణించారు .ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎం.కుమారస్వామి,కులబందవులు అంకం కైలాసం,బోగే ఉపేందర్, హనుమండ్ల సత్యనారాయణ, మిట్టకొల్ల వెంకట్నరాయన, పరికిపండ్ల సంపత్ కుమార్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.


బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 రెబ్బన ; తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో సోమవారం  గోలేటి లోని టీబీజీకేఎస్ కార్యాలయం లో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు  శ్రీనివాసరావు   జెండాను ఎగరవేశారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న ఆంధ్ర సంఘాలు కార్మికులకు పెడుతున్న ఇబ్బందుల నుండి రక్షించి సింగరేణి కార్మికులకు అవసరమైన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా యూనియన్ ప్రారంభించడం  జరిగిందన్నారు. ఏదైతే లక్ష్యంతోనే ఈ యూనియన్ను ప్రారంభించామో  CM కేసీఆర్  మరియు గౌరవ  MP, MLA, ల కృషి మేరకు ఆ లక్ష్యం నెరవేరిందని సింగరేణి కార్మికులకు అన్ని హక్కులు సాధించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రకాష్ రావు రామ్ రెడ్డి రవీందర్ GM ఆఫీస్ పిట్ కార్యదర్శి లక్ష్మీనారాయణ ,నాయకులు రమేష్ మహేష్ ,షర్ఫుద్దీన్ సుగ్రీవులు ,కుమార్ వెంకటేష్ దేవేందర్ ,,హరి సింగ్ తదితరులు

అంబుర్రాన్ని అంటిన గణతంత్ర సంబురాలు

రెబ్బన ;     ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించింది అని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని బెల్లంపల్లి ఏరియా జిఎం కొండయ్య అన్నారు.  ఆదివారం  7 1 గణతంత్ర దినోత్సవం సందర్బంగా గోలేటిలోని భీమన్న స్టేడియం లో జరిగిన సంబరాలలో  ముందుగా జీఎం పాఠశాల విద్యార్థులతో వందన స్వీకారం పొంది,  అనంతరము మాట్లాడారు .   ఒకే ఒక్కడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా జీవించాలని అందరు. సింగరేణి సేవ సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి శిక్షణలు ఇచ్చ్చామని తెలిపారు.  గణతంత్ర దినోత్సవం సందర్బంగా జీఎం ప్రత్యకముగా  తయారు చేసిన  వాహనంలో వచ్చారు . వివిధ పాఠశాల విద్యార్థులు చేసిన   డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి . ఈ కార్యక్రమములో     సేవ అధ్యక్షురాలు లక్ష్మీ కుమారి కొండయ్య  ఎ సె ఓ టు  జిఎం సాయి బాబా ,   టీబీజీకేఎస్  వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస రావు ప్రతినిధి పురుషోత్తం రెడ్డి మేనేజర్ లక్ష్మణరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

రెబెనలలో రేప రెపలాడిన మువ్వన్నెల జెండా

 రెబ్బన మండలములో మువాంనేలా జెండా గురువాము రోజు రెప రెపలాడింది . తహశీల్ధార్ కార్యాలయములో  తహశీల్ధార్ రమేష్ గౌడ్ , ఎంపిడిఓ కార్యాలములో ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్ , ఎం ఈ ఓ ఆఫీసు ఎం ఈ  ఓ వెంకటేశ్వర స్వామీ , హాస్పిటల్లో డాక్టర్ సంతోష్ సింగ్ , ఐకెపి లో ఏ పీఎం వెంకట రమణ , గ్రామ పంచాయతీలో సర్పంచ్ వెంకటమ్మ , వివిధ పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు పాఠశాలల్లో ప్రధానోపాద్యాయులు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు . ప్రైవేటు పాఠశాలల విద్యార్థు ప్రధాన విధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారువిద్యార్థులు చేసిన డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. 

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో అవసరం

రెబ్బెన : ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు ఎంతగానో ఉపయోగపడుతుందని  రెబ్బెన ఆర్ట్స్ అండ్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జాకీర్ ఉస్మాని అన్నారు.  శనివారం ఓటర్ల దినోత్సవం సందర్భంగా  కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్  గంగాపూర్ గ్రామ పంచాయతీ నుండి 40 మంది నూతన ఓటర్లు నమోదు  చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో ఎం ఎస్ ఎస్ పి ఓ గణేష్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కుల సాధన టీబీజీకేఎస్ తోనే సాధ్యం ; బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు

రెబ్బెన : కార్మికుల హక్కులు సాధించాలన్నా ఇతర సౌకర్యాలు కల్పించాలని అది కేవలం టీబీజీకేఎస్ తోనే సాధ్యమని  టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస రావు అన్నారు. శనివారం గోలేటి సి హెచ్ పి లో ఏర్పాటుచేసిన ద్వారా సమావేశంలో మాట్లాడుతూ  కార్మికులకు ఎనలేని హక్కుల సాధించిన ఘనత కోల్ ఇండియాలో లేనివిధంగా సింగరేణిలో ఎన్నికలకు ఇచ్చిన ఘనత కెసిఆర్ మరియు టీబీజీకేఎస్ అని అన్నారు.   క్షేత్రస్థాయిలో కార్మికులకు రావలసిన ఎన్నో హక్కులను సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తుంది టీబీజీకేఎస్ కావున కార్మిక సోదరులు అందరూ గమనించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి మద్దతు తెలపాలని కోరారు.  తండ్రి కొడుకుల ఉద్యోగం 10 లక్షల గృహ రుణ వడ్డీ మాఫీ ఏసీల ఏర్పాటుకు అనుమతి ఉచిత కరెంటు తెలంగాణ ఇంక్రిమెంటు మెటర్నిటీ లీవ్ మూడు నెలల నుంచి ఆరు నెలలకు పెంచుట చైల్డ్ కేర్ లీవ్ రెండు సంవత్సరాల పాటు కల్పించుట PME  కి వెళితే ఆన్ డ్యూటీ కల్పించడం లాంటి ఎన్నో హక్కుల సాధించిన ఘనత 365 మంది కార్మికులకు త్వరలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా క్వాలిటీ డిపార్ట్మెంట్ ను సి హెచ్ పి లో విలీనం చేయడానికి కృషి చేసి వారికి ఎన్నో హక్కులు వచ్చే విధంగా పోరాటం చేసిన సాధించిన శ్రీనివాసరావుకు క్వాలిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సి హెచ్ పి ఇంచార్జి కార్యదర్శి రమేష్ సెంట్రల్ కమిటీ మెంబర్ రాజన్న జిఎం కమిటీ మెంబర్ సమ్మయ్య ,సంపత్, అసిస్టెంట్ కార్యదర్శి సదానందం మరియు మైన్స్ కమిటీ మెంబర్లు మరి సమ్మయ్య రవికుమార్ ఆర్ కె రాములు సమీ శ్రీనివాస్ అమర్సింగ్ సత్యనారాయణ విజయ రమేష్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు ఆర్ శ్రీనివాస్ జి రాజేష్ గోలేటి కార్యాలయ కార్యదర్శి వంగ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

రెబ్బెన : 18 ఏళ్ల వయస్సు రావడంతోనే వోటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని  రెబ్బెన తాసిల్దార్ రియాజ్ అలీ అన్నారు. శనివారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి మానవహారాతో ఓటు హక్కు దుర్వినియోగం చేయొద్దని నోటుకు ఓటు అమ్ముకుని రౌడీ రాజకీయాల తీసుకురావద్దని  ప్రతిజ్ఞ చేయించారు.  అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థిని  విద్యార్థులు వయోజనులు కాగానే విధిగా ఓటు హక్కునిపొంది మంచి నాయకున్ని ఎన్నుకొని అవినీతి రహిత సమాజాన్ని రూపుదిద్దాలని వారు విద్యార్థులకు సూచించారు. ఓటు హక్కు పొందిన తర్వాత స్వేచ్ఛగా దానిని ఉపయోగించుకోవాలని,డబ్బులకు,మందు విందులకు ఓటును అమ్ముకోవడం నేరమని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఉపాతాసిల్దార్ పిట్టల సరిత, హెచ్ఎం స్వర్ణలత, రెవిన్యూ కార్యాల ఉద్యోగులు ఊర్మిళ, మల్లేష్, లక్మి నారాయణ , శ్రీనివాస్,  స్థానిక ప్రజలు పాల్గొన్నారు

బాలికలు మగవారితో సమానంగా ఎదుగలి

రెబ్బెన : బాలికలు ఆరోగ్యం, విద్యా, సామాజికంగా మగవారితో సమానంగా ఎదుగలని ఎంపిపి జుమ్మిడి సౌందర్య ఆనంద్, జడ్పిటిసి సంతోష్ లు అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని గంగాపూర్  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ పూర్ణచెందర్ ,సర్పంచ్ వినోద మధునయ్య, ఆనంద్,  శ్రీనివాస్,  పద్మ,  దేవేందర్   తదితరులు పాల్గొన్నారు

చెడు అలవాట్లు వదిలి ధ్యాన మార్గంలో నడవాలి

 రెబ్బెన :  ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లు వదిలి ధ్యాన మార్గంలో నడవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు  అన్నారు.  శుక్రవారం రెబ్బెన మండలం గంగాపూర్ లో పులజీ బాబా 12వ వార్షికోత్సవం  సందర్భంగా జెండాను ఎగురవేసి  ధ్యాన మందిరన్నీ  సందర్శించరు. అనంతరం మాట్లాడుతూ  మంచి మార్గాన్ని అన్వేషించి ఆచరణలో పెట్టాలన్నారు. తద్వారా మంచి సమాజం నిర్మితమవుతుంది అని సూచించారు. ఈ కార్యక్రమంలో పులజీ బాబా వారసులు కేశవరావు గంగాపూర్ సర్పంచ్ వినోద ఎంపీటీసీ వోలువోజు హరిత జెడ్ పి టి సి సంతోష్ ఎంపిపి సౌందర్య     సోమశేఖర్ వైస్ ఎంపీపీ  సత్యనారాయణ సింగిల్విండో వైస్  చైర్మన్ వెంకటేశం చారి  మాజీ సర్పంచ్ గంటుమేర ముంజం రవీందర్  నవీన్ జైస్వాల్  ఎంపీటీసీ లు టి ఆర్ స్ నాయకులు కమిటీ అధ్యక్షులు సోమయ్య మరియు పులజి బాబా భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

బొగ్గు అన్వేషణ డ్రిల్స్ సందర్శన

  రెబ్బెన :  బెల్లంపల్లి ఏరియా  బొగ్గు అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో గోలేటి ప్రాంతంలో అన్వేషణ చేస్తున్న డ్రిల్స్ ప్రాంతాన్ని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీ మల్రాజు శ్రీనివాస రావు సందర్శించారు. సౌకర్యాలపై గురించి ఆరా తీశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో అన్వేషణ విభాగం యొక్క కృషి ఎనలేనిదని వారు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మారుమూల అటవీ ప్రాంతాలలో అన్వేషణ చేయవలసి ఉంటుందని కావున యజమాన్యం వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.  ఈకార్యక్రమంలో లో టి బి జి కే స్  బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి జెరాజు అన్వేషణ విభాగం పిట్ కార్యదర్శి మైదం వీరస్వామి  ఖైరిగుడా చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నర్సింగరావు పాల్గొన్నారు.


సిసి రోడ్డు పనులు ప్రారంభం

రెబ్బెన :.  మండలంలోని ఇందిరానగర్  గ్రామ పంచాయతీ పరాధీ లోని 5వ వార్డు లో cc రోడ్డు 2.5లక్షలDMFT నిధులతొ సర్పంచ్ దుర్గం రాజ్యలక్ష్మి  గురువారం  ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో  వార్డ్ సభ్యులు దుర్గం లక్ష్మీ  నాయకులు తిరుపతి మోడెం తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

 రెబ్బెన : భారత స్వాతంత్ర పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతిని గురువారం రెబ్బెన మండలం  నక్కల గూడ   ప్రాథమిక పాఠశాలలో  నిర్వహించరుు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  రెబ్బెన స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ .స్వర్ణ లత  హాజరయ్యారు .  నేతాజీ సుభాష్ చంద్రబోసు చిత్రపటానికిిి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ  స్వతంత్రం కోసం పోరాడిన మహా యోధుడు నేతాజీ అని జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యం కోసం పోరాడాలని తెలియజేశారు  ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్   హై స్కూల్ ఉపాధ్యాయులు మేడి చరణ్ దాస్ , ఎస్ ఆర్ కె ప్రభాకర్ రావు , బి. సుదేవి  పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

వ్యవసాయ భూములకు పట్టాలు ఇప్పించాలి

రెబ్బెన :  రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామ శివారులో గత ఐదు సంవత్సరాల నుండి కాసు‌‌తు చేస్తున్న రైతులుకు  పాస్ పుస్తకాలు అందించాలని సర్పంచ్ వినోద అన్నారు. సోమవారం  రెబ్బెన తాసిల్దార్ కార్యాలయంలో ఉపా తాసిల్దార్ పిట్టల సరిత కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 83, 99 సర్వే నెంబర్లో గల భూమిని గత ఐదు సంవత్సరాల 12 కుటుంబాల రైతులు  వ్యవసాయం చేసుకుంటూ  జీవనాన్ని సాగిస్తున్న వారికి  పట్టా పాసు పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. వీరితో పాటు తదితర రైతులు పాల్గొన్నారు.


గొర్రెలు, మేకలకు నట్టల మందులు పంపిణీ

  రెబ్బెన; మండలం లోని  పులికుంట, కొమురవేల్లి  గ్రామాల్లో గల 414 గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందును ఆదివారం మండల పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో పంచాయతీల్లో సర్పంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  పులికుంట సర్పంచ్ - బుర్సా పోషమల్లు
కొమురవేల్లి సర్పంచ్ - మామిడి తిరుమల్ పశువైద్య.  సిబ్బంది పాల్గొన్నారు

నట్టల నివారణకు మందులు పంపిణీ

 రెబ్బెన ; మండలం లోని తక్కళ్ళ పల్లి , రోల్లపాడు   గ్రామాల్లో గల 284 గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందును ఆదివారం మండల పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో పంచాయతీల్లో సర్పంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తక్కళ్ళపల్లి సర్పంచ్ - మడే శంకర్ రోళ్ల పాడు సర్పంచ్ - మంజిలి హనుమక్క  MPTC - సంగం శ్రీనివాస్ వార్డ్మెంబెర్స్ - సరిత , లక్ష్మీ  పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

 రెబ్బెన :  అప్పుడే పుట్టిన పాప నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎంపీపీ సౌందర్య ఆనంద్,జడ్పీటీసీ సంతోష్ లు అన్నారు. ఆదివారం రెబ్బెన మండలంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతు  తమ పిల్లల భవిష్యత్తు కొరకు, పోలియో రహిత సమాజం కొరకు తల్లిదండ్రులందరూ ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల తమ పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జ్వరం వచ్చినా కూడా పోలియో చుక్కలు వేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అహల్యాదేవి, ఎంపీటీసీ మధునయ్య, డాక్టర్ వినోద్ కుమార్,నర్స్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

నట్టల మందులు పంపిణీ

 రెబ్బెన :  మండలం లోని నంబాల  గ్రామంలో శనివారం గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందును  మండల పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో నంబల సర్పంచ్ చిన్న సోమశేఖర్ నట్టల మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో  వైస్ ఎంపీపీ గజ్జెల సత్యనారాయణ ఉప సర్పంచ్  అశోక్ క్ పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సిబ్బంది పాల్గొన్నారు.

భీమ దేవర జండా పండుగ

రెబ్బెన :  18వ  ఆత్మగౌరవ భీమ దేవర జెండా పండుగను  రెబ్బెెన మండలంలోని   పులికుంటలొ ఆదివారం ఘనంగా నిర్వహించారు. జెండా పండుగ లో భాగంగా ఆదివాసి  మహిళలు బోనాలతో మరియు యువకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని   ఈ జెండా జెండాను ఎగరవేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసి కోలవర్ మన్నె వార్ జెండా పండుగను భీమదేవర పడగను పాత సాంప్రదాయాల ప్రకారం కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో, కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర గట్టి సుధాకర్ సర్పంచ్ బురుస పోచ మల్లు ,మండల గౌరవ అధ్యక్షులు  భీమయ్య, యువకులు గోపాల్ భీమే ష్  మహేష్ కొండయ్య మల్లయ్య హనుమంతు  తదితరులు పాల్గొన్నారు

పల్లె ప్రగతి పై గ్రామసభలు

రెబ్బెన :  మండలంలోని పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పదిరోజుల  పనుల ప్రణాళికలపై గ్రామపంచాయతీలో గ్రామా ప్రణాళిక ముగింపు సభలు సర్పంచుల అధ్యక్షతన  నిర్వహించారు  అభివృద్ధి చేసిన అంశాల గురించి చర్చించారు. చేయాల్సిన పనులు గురించి చర్చించి గ్రామ ప్రణాళిక విజయవంతం చేయుటకు పాల్గొనిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ లు బొమ్మినేని అహల్యాదేవ, చెన్న సోమశేఖర్,    పోటు సుమలత వినోద  రాజ్యలక్ష్మి    పోచ మల్లు    మిగతా గ్రామపంచాయతీ సర్పంచ్లలు ఉప సర్పంచులు, సోమశేఖర్ వైస్ ఎం పి పి గజ్జల సత్యనారాయణ,  రూప సర్పంచులు నేని శ్రీధర్,పంచాయితీ సెక్రటరీ,స్పెషల్ ఆఫీసర్,  వార్డ్ మెంబెర్ లు తదితరులు. పాల్గొన్నారు

బిజెపి మండల కార్యవర్గం ఎన్నిక

రెబ్బెన  : బిజెపి మండల కార్యవర్గ   ఎన్నికను  శనివారం మండల అధ్యక్షుడు గోళం తిరుపతి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు మండల ఉపాధ్యక్షుడిగా పందిళ్ల కనకయ్య, బానోత్ సుబ్బారావు, ప్రకాష్, ను ప్రధాన కార్యదర్శులుగా మల్లేష్, కార్యదర్శిగా  ఓదేలు,  భారత్, వెంకటేష్, కోశాధికారిగా దుర్గాప్రసాద్ కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  జెసిబి పడెల్,  ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ ఆత్మ  ప్రధాన ధాన కార్యదర్శి ఆత్మ రామ్ నాయక్, ఆంజనేయులు గౌడ్, అసెంబ్లీ కన్వీనర్  చక్రపాణి జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ జిల్లా ఎన్నికల ఇంచార్జ్ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధిల ప్రజల పాలు పంచుకోవాలి

 రెబ్బెన : గ్రామాల అభివృద్ధి కోసం గ్రామంలో ఉన్న ప్రజలు కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ప్రతిఫలం లో పంచాయతీ ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పిడి వెంకట్ సైలస్ అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని వన్ కులం రాంపూర్ తక్కలపెల్లి రోళ్ళపాడు గ్రామ పంచాయతీలో ఆయన పర్యటించారు. నర్సరీ డంపింగ్ యార్డ్ తదితర అంశాల నో నో నో అడిగి తెలుసుకున్నారు.  మాట్లాడుతూ పల్లె పల్లె పల్లె ప్రగతి లో గ్రామాలు పరిశుభ్రంగా పచ్చదనంతో ఉండాలన్నారు. కార్యక్రమంలో సి పి ఓ కృష్ణయ్య  ఎం పి పి సౌందర్య జెడ్ పి టి సి సంతోష్ సర్పంచ్    హనుమక్క  ఎం పి డి ఓ సత్యన్నారాయణ సింగ్ ఎం పి టీ సి సంగం శ్రీనివాస్, తదితరులు  పాల్గొన్నారు


అంతర్ జిల్లాల ఆటల పోటీలు

 రెబ్బెన : 65వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్టిక్ బాల్బాడ్మింటన్ పోటీలను శుక్రవారం గోలేటి సింగరేణి పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీలకు 10 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు తరలివచ్చారు. ముందుగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియా జిఎం కొండయ్య హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ  సింగరేణి సంక్షేమ అభివృద్ధి తో పాటు క్రీడాకారులకు అన్ని విధాలా  సహకరిస్తుందని అన్నారు జాతీయస్థాయిలో పేరు గడించి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు గ్రామం క్రీడలలో మంచి పేరు గడించింది అన్నారు.

ఉన్ని దుస్తులు పంపిణీ

రెబ్బెన : మండలం లోని  పులి కుంట  గ్రామ పంచాయతీ లో గల మూడు ప్రభుత్వ ప్రాధిమిక పాఠశాలల  విద్యార్థులకు  రాష్ట్ర నీటి పారుదల శాఖ వారి ఉద్యోగుల ఆధ్వర్యంలో  ఉచితం గా ఉన్ని దుప్పట్లు  రాత పుస్తకాలు మరియి పెన్నులు  పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమం నకు  గ్రామ సర్పంచ్  బుర్స పోషమల్లు  సూ పరెండెంట్ అఫ్ ఇంజనీర్  శ్రీ విష్ణు ప్రసాద్, వారి ఉద్యోగ సిబ్బంది పగిడి అరుణ,  పగిడి  జనార్దన్   రమణా రెడ్డి, ఆన్వేష్,   గ్రామ పంచాయత్ సెక్రటరీ సరిత  ఆయా పాఠశాల ల ప్రధానోపాద్యాయలు  ఉపాధ్యాయలు  మరియు గ్రామస్తులు పాల్గొన్నారు..

ఇందిరానగర్ గ్రామం లో మద్యపానం నిషేధం

   రెబ్బెన‌ : రెబ్బెన మండలం లోని ఇందిరానగర్ గ్రామం లో సర్పంచ్ రాజ్యలక్ష్మి   తిరుపతి అధ్యక్షతన గురువారం గ్రామంలో పూర్తిగా మద్యపానం నిషేధం   చేయాలని తీర్మానిచారు గ్రామస్తు యువకులు మద్యానికి బానిస కావడం వలన  తరుచు గొడవలకు కారాణాలు అవుతున్నావి  పూర్తిగా మద్యపానాన్ని నిషేదించాలని బెల్ట్ షాపులు మరియు గుడుంబా అమ్మకాలు నిషేధించాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు మీసాల శ్యాంరావ్.ఆదివాసి కొలావార్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్గటి సుధాకర్ కొలావార్ ఆదివాసి మండల అధ్యక్షుడు మైలారపు శ్రీనివాస్, గ్రామస్థులు దుర్గం జానయ్య, కమ్మరి మల్లేష్, దుర్గం తిరుపతి,  తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులకు ఆట వస్తువులు పంపిణీ

 రెబ్బెన‌ ;  రెబ్బెన మండలం లోని ఖైరిగూడా గ్రామపంచాయతీ లో గురువారం మండల ప్రాథమిక పాఠశాల నందు పిల్లలకు కు ఆట వస్తువులను బిజెపి ఆసిఫాబాద్  అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీరా ఆత్మారాం నాయక్ పంపిణీ చేశారు.  వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పల్లెల్లో ఉన్న పిల్లలు ప్రభుత్వ పాఠశాలలొ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారి  మానసిక ఎదుగుదలకు ఆటలు ఎంతో సాయపడతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ పంచాయతీ సెక్రెటరీ వినోద్ గ్రామ పెద్దలు వస్త్రం నాయక్ హరి నాయక్ గణేష్ చిలుముల శంకరి వసంతరావు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

 రెబ్బెన :   అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మండల ఎంపిపి సౌందర్య  ఆనంద్ జడ్పిటిసి సంతోష్ లు అన్నారు బుధవారం రెబ్బెన మండలం లోని రాజారం గ్రామంలో రోడ్లపై ఏర్పడిన గుంతలను మట్టితో పుడిపించారు. అలాగే వెల్కమ్ బోర్డులను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ   నాణ్యమైన పనులను వేగవంతంగా చేసి రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలను పల్లెలో పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. మండలం కోమరవేల్లి  గ్రామ పంచాయతీలో మామిడి తిరుమాల్  ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలో నర్సారి మరియు రోడ్డు కి ఇరువైపుల పిచ్చిమొక్కలను మరియు  సైడ్ డ్రైన్ పనులను అలాగే రెబ్బెన నంబరు ఇంద్రానగర్, గూడెం మాధవా గూడెం,  నవగం తదితర గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు

ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి

 రెబ్బెన ; పల్లె ప్రగతి లో ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  అన్నారు బుధవారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న పల్లె ప్రగతి ఈ కార్యక్రమానికి విచ్చేసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ  పల్లె ప్రగతి లో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఈ ప్రజల సహకారంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రతి ఒక్కరూ  పాలుపంచుకొని బంగారు తెలంగాణ కి శ్రీకారం చుట్టాలని,  పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం కాపాడుకోవచ్చని మన ఏరియాలో మనం మనం పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు అలాగే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక బ్రో ఏర్పాటు చేసుకుని పరిశుభ్రంగా ఉంచాలి అన్నారు.  ముందుగా కిష్టాపూర్ లోని నర్సరీలను పరిశీలించిన పరిశీలించి ఆ ఏరియాలో డంపింగ్ యార్డ్ స్థల పరిశీలన చేశారు.  కార్యక్రమంలో సి పి ఓ కృష్ణయ్య  ఎం పి పి సౌందర్య జెడ్ పి టి సి సంతోష్ సర్పంచ్   జమున, చెన్న సోమశేఖర్,  ఎం ఆర్ ఓ రియాజ్ అలీ ఎం పి డి ఓ సత్యన్నారాయణ సింగ్ ఎం పి టీ సి సంగం శ్రీనివాస్, రాజు తదితరులు  పాల్గొన్నారు

విద్యార్థి నాయకురాలి పైన దాడి పాశవికం

 రెబ్బెన : ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటి అధ్యక్షురాలిగా ఎన్నికైన అయేషా గోష్ వామపక్ష విద్యార్థి నాయకురాలి పైన యూనివర్సిటీ ప్రొఫెసర్ మీద,సామాన్య విద్యార్థుల మీద నిన్న రాత్రి జరిగిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు.JNU లో పాగా వేసేందుకు మతోన్మాద సంఘాలు ఇలాంటి దాడులు చేస్తూ విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే వారిపైన దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు.ఇలాంటి దాడులు పునరావృత్తం అవుతే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

పల్లె ప్రగతి లో అభివృద్ధికి శంకుస్థాపనలు

రెబ్బెన :  పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం   నంబాల గ్రామ పంచాయతీ లో స్మశానవాటిక ,  డప్పింగ్ యార్డు మరియు స్మశానవాటికకు   వెళ్ళడానికి రోడ్డు జె సి బీ మరియు బ్లెడ్ ట్రాక్టర్ సహాయం తో  సర్పంచ్ చెన్న సోమశేఖర్   ఎం పి పి జుమీడి సౌందర్య జెడ్ పి టీ సి వేముర్ల సంతోష్ భూమి పూజ   రోడ్లకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి చదును చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ఎం పి పి గజ్జల  సత్యనారాయణ, ఉప సర్పంచ్ అశోక్,  పి ఆర్ డి ఈ రాజన్న, ఏ ఈ జెగన్నాథం,  తదితరులు పాల్గొన్నారు.


క్రీడలతో మానసిక ఉల్లాసం


రెబ్బెన : క్రీడలు మానసిక వికాసానికి కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపకరిస్తాయి  అని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కొండయ్య అన్నారు. శనివారం గోలేటి భీమన్న  స్టేడియంలో సింగరేణి  9 పాఠశాల విద్యార్థులు కు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను క్రీడల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు.  ఈ క్రీడల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఎటువంటి డిఎం సాయిబాబాగా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు పర్సనల్ మేనేజర్ లక్ష్మణ్ రావు రామశాస్త్రి సీనియర్ పీవో కార్యదర్శి      కృష్ణ కుమార్ సూపర్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.