Thursday, 31 May 2018

సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మరాదు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 31 ; (రెబ్బెన) ; సోషల్ మీడియా వాట్స్ అప్  లో  వస్తున్న వదంతులు నమ్మి ఇబ్బందులకు  గురికావద్దని రెబ్బెన సీఐ పురుషోత్తమ్ చారి గురువారం నాడు ఖైరుగూడ ప్రజలతో అవగాహనా సదస్సు నిర్వహించారు.సదస్సులో సీఐ  మాట్లాడుతు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మేసేజ్ లు,వీడియోలు వస్తున్న సంగతి తెలిసిందేనని చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి  చంపేస్తున్నారంటూ వదంతులు నమ్మి  ప్రజలు బయాందోనళకు గురై ఇబ్బందులకు పడద్దు అన్నారు.ఏదైనా అత్యవసర సమయాల్లో డైల్ 100 తెలిపితే వెంటనే స్పందిస్తామని తెలిపారు. అదే విదంగా 5 సంవత్సరాలు నిండిన  పిల్లలను బడిలో చేర్పించి విద్యను అభ్యసించే విదంగా తల్లిదండ్రులు పిల్లలను పాటశాలల్లో చేర్పించాలన్నారు. నిషేదిత గుట్కా,మద్యం గ్రమాల్లో అమ్మరాదని ఎవరైనా అసాంగిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్య చర్యలు తీసుకోబడును అన్నారు.అవగాహనా సదస్సులో రెబ్బెన ఎస్ఐ శివకుమార్,పోలీస్ సిబ్బంది గ్రమ ప్రజలు పాల్గొన్నారు.

తెలంగాణ క్రీడా పాఠశాలల ప్రవేశాల కై ఎంపికలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 31 ; (రెబ్బెన) ;  తెలంగాణ క్రీడా పాఠశాలల ప్రవేశాల కొరకు మండల స్థాయిలలో ఎంపికలు జరగనున్నట్లు రెబ్బెన మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించే  ఎంపిక పోటీలు గోలేటి  సింగరేణి పాఠశాల క్రీడా మైదానంలో జూన్ 3 వ తేదీన ఉదయం 7.00 గంటల నుండి నిర్వహించబడునని అన్నారు. ఇట్టి అవకాశాన్ని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ ఎంపిక పోటీలు జిల్లా విద్యా శాఖ మరియు పోలీస్ శాఖ వారితో  సంయుక్తంగా నిర్వహిస్తున్నామన్నారు.

Wednesday, 30 May 2018

టాస్క్ ఫోర్స్ సంచలన దాడిలో అక్రమంగా కలిగి ఉన్న భారీ ఫైర్ వర్క్స్ నిల్వలు, కలప, గుట్కా మరియు మద్యం నిల్వ పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 30; కౌటాల  టోంకిని మరియు కౌటాల మండల కేంద్రంలో అక్రమంగా  భారీ ఫైర్ వర్క్స్ నిల్వలు, కలప, గుట్కా మరియు మద్యం నిల్వలు ఉన్నాయనే  ఖచ్చితమైన నిఘా  సమాచారం తో టాస్క్ ఫోర్స్  సి. ఐ  రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్  లు తనిఖీ చేయగా *సంజయ్ సర్కార్* యొక్క ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5,00,000/- విలువ చేసే అనుమతిలేని ఫైర్ వర్క్స్, 5,000/- విలువ చేసే గుట్కా, 3,000/- విలువ చేసే మద్యం మరియు 15 ఫీట్ల టేకు కలప స్వాధీనం చేసుకోవటం జరిగినది. తదుపరి అతని సోదరుడు *సుజిత్ సర్కార్* యొక్క కిరాణం షాపులో 3,000/- విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకోవడం జరిగినది. అనంతరం *కాసనగొట్టు శ్రీదర్* యొక్క శ్రీనిధి కిరాణం షాపులో సుమారు 2,000/- విలువ చేసే గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకొని వీటన్నింటిని తదుపరి విచారణ నిమిత్తం కౌటాల పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించరు.

గ్రామ సభల్లో పట్టాదారు పాసుపుస్తకాలు తప్పులు సవరించుకోవాలి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 30; రెబ్బెన ; గ్రామ సభల్లో పట్టాదారు పాసుపుస్తకాలు తప్పులు సవరించుకోవాలని తాసిల్దార్ సాయన్న అన్నారు బుధవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.వివిధ తారీఖులు వారీగా రెవెన్యూ సి బ్రాంది గ్రామాల్లో దరఖాస్తులు తీసుకుని పట్టాపాసు పుస్తకాలు మరియు  ఎకరాల విస్తీర్ణం కుల మార్పులు భూ స్వభావము తప్పుగా నమోదు అయితే మరియు  ఫోటో ఆధార్ కార్డు విరాసత్ కొరకు  దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

కొలతల ప్రకారం ఉపాధి కూలీలకు సరైన వేతనం : డి ఆర్ డి ఓ వెంకట్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 30; రెబ్బెన ; ఉపాధిహామీ కూలీలకు కేటాయించిన పని కొలతల ప్రకారం పూర్తిచేసినట్లైతే కొలతలకు  తగ్గట్టుగా సరైన  కూలి డబ్బులు చెల్లిస్తామని డి ఆర్ డి ఓ వెంకట్ అన్నారు. బుధవారం   రెబ్బెన మండలంలోని నారాయణపూర్, కిష్టాపూర్, నంబాల గ్రామపంచాయతీ పరిధిలలో జరుగుతున్న  ఉపాధిహామీ పనులను డి ఆర్ డి ఓ వెంకట్ పరిశీలించారు.  ఈ సందర్భంగా అయన కూలీల  హాజరు పట్టీలను, వారికి  ఏర్పాటు చేసిన వసతులను   పరిశీలించారు.వారికీ కేటాయించిన పనులను నాణ్యతతో కొలత ల ప్రకారం చేసినట్లయితే డబ్బులు ఎక్కువ వస్తాయని సూచించారు. ఎండవేడికి ఉపశమనంగా టెంట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  వీరితోపాటు ఏ  పి  ఓ కల్పన, ఉపాధి  హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు  పాల్గొన్నారు.  

Tuesday, 29 May 2018

వేసవి సెలవులు జూన్ 12 వరకు పొడిగించాలి.

రాష్ట్రంలో  ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, పిల్లలు బయటికి వచ్చే పరిస్థితి లేదని ఏ  ఐ ఎస్  ఎఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు.   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుకల్లో విద్యార్థులు సైతం పాల్గొనాలనే ఉద్దేశ్యంతో 2018-19 విద్యా సంవత్సరాన్ని జూన్ 1 వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించిందని అన్నారు. గతంలో జూన్ 12 వ తేదీన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేదని, అప్పటి వరకు రుతుపవనాలు వచ్చి వాతావరణం చల్లబడేదని, కానీ ఈ సంవత్సరం ఇంకా ఎండ తీవ్రత ఎక్కువగా వున్న నేపథ్యంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులు జూన్ 12 వరకు పొడిగించాలని కోరారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందుబాటులో ఉన్న విద్యార్థులతో వేడుకలు జరుపుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరారు.

బదిలీపై వెళ్తున్న ఎస్ ఓ టు జియం ను సన్మానించిన అధికారులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 29; రెబ్బెన ; బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి  కార్యాలయంలో  ఎస్ ఓ టు జియం గా విధులు నిర్వహించిన ఎం శ్రీనివాసరావు బదిలీపై  శ్రీరాంపూర్ ఏరియా ఆర్ కె- 5 గ్రూప్ ఏజంట్ గా వెళ్తున్న   సందర్బంగా మంగళవారం జెనరల్ మేనేజర్ కార్యాలయం లో జియం రవి శెంకర్ మరియు అన్ని  గనుల డిపార్ట్మెంట్ల అధిపతులు వారిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జియం రవి శెంకర్ మాట్లాడుతు తన విది నిర్వహణలో కంపెనీ శ్రేయస్సుకై  పని చేసి బదిలీపై వెళ్తున్న ఎస్ ఓటు జియం ఎం శ్రీనివాస్   పని చేసిన  తక్కువ కాలంలోనే అందరి అదరాభిమానాలు  పొందిన   అభినందనీయుడని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్లు కె కొండయ్య,చింతల శ్రీనివాస్,జి మోహన్ రెడ్డి, ఏరియా ఇంజనీర్ రామారావు,ఫైనాన్స్ మేనేజర్ శ్రీధర్,డిజియం సివిల్ ప్రసాద్ రావు,డిజియం కమలాకర్ భూషణ్,డివైసీఎంఓ అశోక్ కుమార్,ఎస్టేట్ ఆఫీసర్ వరలక్ష్మి,డివై పియం రాజేశ్వర్,విజయ్ సింగ్,రమేష్ ,జలపతి, మరియు అన్ని గనుల డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోఅల్పాహార పంపిణి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  మే 29 ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెరాస మహిళా విభాగం నాయకులు   మన్యం పద్మ,అన్నపూర్ణ అరుణ ల   ఆధ్వర్యంలో మంగళవారం  గర్భిణీ స్త్రీలకు అల్పాహారం పంపిణి చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు.ప్రభుత్వాస్పత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం తమ  వంతుగా సేవా దృక్పధం తో ప్రతివారం  అల్పాహారం పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. తెరాస మహిళా విభాగం తరుపున భవిష్యత్ లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ, ఆస్పత్రి  సిబ్బంది పాల్గొన్నారు. 

పాఠశాల బస్సులను పూర్తి ఫిట నెస్ తో ఉంచాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  మే 29 ; రెబ్బెన మండలం లో ఉన్న అని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల బస్సులను,వేన్  లను పూర్తి ఫిట్ నెస్ తో ఉంచాలని రెబ్బెన ఎస్సై  శివకుమార్ అన్నారు.  విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో విద్యార్థులను పాఠశాలలకు తీసుకువచ్చే బస్సు, వేన్  లను  మంగళవారం  పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  వీటిని నడిపే డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని, డ్రైవర్  పేరును వాహనాలపై ప్రస్ఫుటంగా కనిపించేలా చేయాలనీ,  వారి వివరాలను పోలీస్ స్టేషన్లో  అందచేయాలని అన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవట్ స్కూల్ యజమానులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Sunday, 27 May 2018

రాజకీయ దురుద్దేశాలతో ఎం ఎల్ ఏ పై నిందలు మోపడం సరికాదు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  మే 27 ; రెబ్బెనతెరాస ప్రభుత్వం చేపట్టిన  అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో అమలుచేసి, ప్రజలలో అభిమానాన్ని సంపాదించుకుంటున్నఎం ఎల్ ఏ   కోవలక్ష్మి పై రాజకీయ దురుద్దేశాలతో నిందలు మోపడం సరికాదని  కొమురంభీం జిల్లా తెరాస మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మలు అన్నారు.   ఆదివారం రెబ్బెనమండల కేంద్రం అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడరు. మాజీ ఎం ఎల్ ఏ  ఆత్రం సక్కు, డి సి సి ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాదరావు చేసిన ఆరోపణలు అవాస్తవాలని అన్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన  అభివృద్ధి పనులను  ఓర్వలేక అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాసేవకే అంకితమైన కుటుంబం నుంచి వచ్చిన  కోవలక్ష్మిగతంలో సర్పంచ్ గ రెండు సార్లు, ఎం పి  పి   గ ప్రజలకు సేవలందించారని అన్నారు.   ఎం ఎల్ ఏ  ఒక ఇల్లు కట్టుకొంటే తప్పాఅని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన టౌన్  అధ్యక్షురాలు ఎం  ,ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ అరుణ, కే లక్ష్మి, ఏ  పద్మ, ఇంకు బాయి , పోచమ్మ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సేవా సంస్థ ఆద్వర్యంలో అంబలి పంపిణి

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  మే 27 ; రెబ్బెన మండలం గోలేటి బస్టాండ్ లో వేసవి కాలం సందర్బంగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ఆద్వర్యం లో  అంబలి పంపిణి కార్యక్రమం చేపట్టారు. అధ్యక్షులు ఓరగంటి రంజిత్ మాట్లాడుతూ వేసవి కాలం లో ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి ఆదివారం 500 మందికి అంబలి పంపిణి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజాశేఖర్, రవీందర్,ఏగ్గే తిరుపతి ప్రధాన,సహాయ కార్యదర్శి అజయ్, విజయ్, సభ్యులు, బలుగురి తిరుపతి,రాజశేఖర్,సాయి,అమ్ములు,తదితరులు పాల్గొన్నారు.

Saturday, 26 May 2018

బిటెక్ మైనింగ్ కోర్సులలో చేరుటకు దరకాస్తుల ఆహ్వానం

            కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  మే 26 ; రెబ్బెన : బి టెక్ కోర్సులలో చేరుటకు విద్యార్థులు ధరకాస్తులు చేసుకోవాలని బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి డిజిఎం పర్సనల్ జె కిరణ్ కుమార్ శెనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  జెఎన్ టియూహెచ్ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ మంథని మరియు యూనివర్సిటీ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం లలో.కాలేజ్ సీట్ల ఉన్నట్లు తెలిపారు.  జెఎన్ టియూహెచ్ కాలేజ్ మంథని నందు సీట్లు,  మైనింగ్ ఇంజనీరింగ్ -02, సివిల్ ఇంజనీరింగ్-03, మెకానికల్ ఇంజనీరింగ్ -03,ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ -03, కంప్యూటర్ సైన్స్-03 సీట్లు ఉన్నాయన్నారు. .మరియు  యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం నందు మైనింగ్ ఇంజనీరింగ్ 02 సీట్లు ఉన్నట్లు తెలిపారు.ఆసక్తి వీటికి కావాల్సిన అర్హతలు 2018 ఎంసెట్ లో క్వాలిఫై అయి ఉండాలి అని,కార్మిక పిల్లలకు మాత్రమే అర్హత కలదన్నారు. వీటి యొక్క దరఖాస్తులు జూన్ 20 లోపు జియం హెచ్ ఆర్ డి కు పంపించాలన్నారు.పూర్తి వివరాలకై పర్సనల్ డిపార్ట్మెంట్ నందు సంప్రదించాల్సింగా తెలిపారు.         

Friday, 25 May 2018

చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరం ; ఎస్ఐ శివకుమార్


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 25 ; (రెబ్బెన) ; వదంతులు నమ్మి ప్రజలు ఇబ్బందులకు గురికావద్దని,  చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరంమని రెబ్బెన ఎస్ఐ శివ కూమార్ అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలంలోని గ్రమాలలో అవగాహన కల్పించారు.    గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మేసేజ్ లు,వీడియోలు వస్తున్న సంగతి తెలిసిందేనని చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి  చంపేస్తున్నారంటూ వదంతులు వస్తున్నాయి అని  దీనితో భయంతో అనుమానం వచ్చిన మతిస్థితం లేని వారిని మాములు వ్యక్తులపై దాడులు చేస్తుండడంతో ప్రాణనష్టం సంభవిస్తోంది అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న మేసేజ్ లు, వీడియోలు ఎవరూ నమ్మవద్దని సూచించారు.రాష్ట్ర లో ఇప్పడి వరకు ఎక్కడ ఇలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. ప్రజలు ఎవరు కూడా భయబ్రాంతులకు గురికావద్దని సూచించారు. అనుమానంతో చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎవ్వరిని కొట్టరాదని అన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారాన్ని  తెలియచేయాలని అన్నారు.

విద్యతో పాటు క్రీడలలో రాణించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 25 ; (రెబ్బెన) ; విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని బెల్లంపల్లి ఏరియా  సింగరేణి ఇంచార్జి జీఎం  కొండయ్య అన్నారు. శుక్రవారం రెబ్బెనమండలం గోలేటి  జీఎం  కార్యాలయంలో శనివారంరాష్ట్ర స్థాయి జూనియర్స్ ,సబ్ జూనియర్స్ సిద్ధిపేట మినీ స్టేడియం లో జరిగే స్విమ్మింగ్ పోటీలలో పాల్గొనే విద్యార్థులను ప్రోత్సహించి మాట్లాడారు. ఈ పోటీలలో మంచి ప్రతిభచూపించి గోలేటి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిజిఎం  పర్సనల్ కిరణ్,డి వై పీఎం రాజేశ్వర్, టీజీబీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు. 

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళలకు, చిన్నారులకు ఆటల పోటీలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 25 ; (రెబ్బెన) ; తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి సింగరేణి ఏరియా లో ఉన్న మహిళలకు, చిన్నారులకు ఆటల  పోటీలు నిర్వహిస్తున్నట్లు సింగరేణి ఇంచార్జి జీఎం కొండయ్య శుక్రవారం  తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 27న బెల్లంపల్లి  టి సి ఓ క్లబ్ లో సాయంత్రం 4గంటల నుండి 6 గంటల వరకు, 28న మాదారం కమ్యూనిటీ హాల్ లో మరియు  29న గోలేటి స్కూల్ లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలవరకు నిర్వహించబడునని తెలిపారు. పోటీలలో గెలుపొందినవారికి జూన్ 2 న సాయంత్రం జరిగే  తెలంగాణ ఆవిర్భావ వేడుక సభలో జీఎం కే రవిశంకర్,సేవ అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ రవిశంకర్ చేతుల మీదుగా బహుమతుల  ప్రదానం జరుగుతుందని తెలిపారు.

Thursday, 24 May 2018

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం ; ఇంచార్జ్ జియం కె కొండయ్య

    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 24 ; (రెబ్బెన) ;  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని  బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఇంచార్జ్ జియం కె కొండయ్య అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం సింగరేణి అధికారులకు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ  సంవత్సరం కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పండుగ వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించుకోవాలని అధికారులకు సూచించారు సింగరేణి ప్రతి డిపార్టుమెంటల్ లో కూడా అందరు వేడుకలను జరుపుకోవాలన్నారు . ఆవిర్భావ దినోత్సవం రోజున ఉదయం  జి ఎం  కార్యాలయం నుండి తెలంగాణ రన్ కార్యక్రమం ఉంటుందన్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఆటలాపోటీలు మరియు దీపాలంకరణ పోటీల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సింగరేణి పాఠశాల  ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. సింగరేణికి  సంబందించిన స్టాల్స్ తో పాటు తెలంగాణ వంటకాల స్టాల్ లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ  ఆవిర్భావ దినోత్సవంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకొని పండుగ వేడుకలను విజయవంతం చేయాలనీ కోరారు.  ఈ కార్యక్రమంలో డిజియం పర్సనల్ జె కిరణ్ కుమార్,ఎస్ ఓటు జియం ఎం శ్రీనివాస్,ఎజియం ఎం రామారావు, ఫైనాన్స్ మేనేజర్ బి శ్రీధర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ జి మోహన్ రెడ్డి, డివై సిఎంవో కె అశోక్ కుమార్, డివైపియం లు ఏ రాజేశ్వర్, బి సుదర్శనం, అన్ని గనుల డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

కూరగాయల వ్యాపారి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 24 ; (రెబ్బెన) ; రెబ్బెన మండల కేంద్రంలో స్థానికంగా  కూరగాయల వ్యాపారం నిర్వహించే సచిన్ జైస్వాల్ దంపతులు షిర్డీ సాయిబాబా భక్తులు కావడంతో మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు గత కొన్నినెలలుగా ప్రతి గురువారం మధ్యాహ్నం   అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సచిన్ జైస్వాల్ దంపతులు మాట్లాడుతూ మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ  కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు   నిరంతరంగా ప్రతి గురువారం ఉంటుందని అన్నారు.

Wednesday, 23 May 2018

జర్నలిస్టుల గర్జనను విజయవంతం చేయండి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 23 ; రెబ్బెన : జర్నలిస్టుల  సమస్యల పరిష్కరానికై టియుడబ్ల్యూజె(ఐజెయు) ముందుంటుందని  కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి సామిల్ల సంపత్ కుమార్ అన్నారు. బుధవారం రెబ్బెన లోని అతిధి గృహ ఆవరణలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికై హైదరాబాద్ లో తలపెట్టిన జర్నలిస్టుల   గర్జన పోస్టర్లు,కరపత్రాలు విడుదల చేసారు. అనంతరం  మాట్లాడుతు ఈ నెల 28వ తేదీన తలపెట్టిన జర్నలిస్టుల గర్జనను విజయవంతం చేయాలని కోరారు. గత కొద్ది సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదన్నారు. ముఖ్యంగా  జర్నలిస్టుల అక్రడేషన్ కార్డులతో పాటు,అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని అలాగే  అర్హులైన గ్రామీణ,మండల మరియు పట్టణ ప్రాంత  జిల్లా కేంద్ర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్  సెక్రటరీ  కె సునీల్ కుమార్, సంయుక్త కార్యదర్శి దొబ్బల శ్రీనివాస్,  సభ్యులు డి సంజీవ్ కుమార్,ఇ పోచయ్య, కుమార్,వి వినయ్ కుమార్,ఎస్ దాసుబాబు,తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 22 May 2018

లోక కళ్యాణార్థమై హారేరామ హారేకృష్ణ లక్ష సంకీర్తన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 22 ; రెబ్బెన మండలం  గోలేటి లో మంగళవారం శ్రీ కోదండరామలయం అధిక జేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని  సంతోష్ శర్మ  ఆద్వర్యం లో  లోక కళ్యాణార్థమై హారేరామ హారేకృష్ణ లక్ష సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు కోదండ రామాలయంలో జేష్ఠ మాస సందర్బంగా ప్రజల సుఖ సంతోషాల కోసం  ప్రత్యేక పూజలు నిర్వ్హయించినట్లు తెలిపారు.  కార్యక్రమంలో భక్త మహశేయులు మరియు హనుమాన్ సేవసమితి సభ్యులు గోలేం విలాస్.పోటు శ్రీధర్ రెడ్డి మూతే సత్యనారాయణ.జనగామ విజయ్ కుమార్.మంతెన రమేష్.పేట స్వామి మరియు మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పులిహోర పంపిణి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 22 ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెరాస మహిళా విభాగం నుంచి  మన్యం పద్మ,అన్నపూర్ణ అరుణ ల   ఆధ్వర్యంలో మంగళవారం  గర్భిణీ స్త్రీలకు అల్పాహారం పంపిణి చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు.ప్రభుత్వాస్పత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం మా వంతుగా సేవా దృక్పధం తో అల్పాహారం పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని అన్నారు..తెరాస మహిళా విభాగం తరుపున భవిష్యత్ లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ,డా:కుమార స్వామి,భాగ్య లక్ష్మి ఎస్ ఎన్,లావణ్య,కె రవి,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.      

Sunday, 20 May 2018

బాటసారులకు అంబలి పంపిణి

.  
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 20 ; ఎండాకాలం సందర్బంగా ఎండ వేడిమికి ఉపశమనం కొరకు బాటసారులకు  బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ ఆద్వర్యం లో ఆదివారం రెబ్బెన మండలం  గోలేటి బస్టాండ్ లో  అంబలి పంపిణి కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా బెటర్ యూత్ సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ మాట్లాడుతూ ఎండల కారణంగా ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మా వంతు గా అంబలి పంపిణి కార్యక్రమం  చేపట్టినట్లు  తెలిపారు. భవిష్యత్ లో బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ తరుపున  మరెన్నో ఉపయోగకరమైన మరియు  సేవా కార్యక్రమాలు చేపడాతం అని అన్నారు.ఈ కార్యక్రమము లో సేవా సంస్ట ఉపాధ్యక్షులు రాజశేఖర్,రవీందర్, ప్రధాన కార్యదర్శి, అజయ్, సహాయ కార్యదర్శి.విజయ్, తిరుపతి, కోశాధికారి,తిరుపతి,శేఖర్,అరవింద్, తదితరులు పాల్గొన్నారు.

ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించండి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 20 ; ఖైదీల జీవితాల్లోమార్పు తెచ్చి  వారి కాళ్లపై  వారు నిలబడేవిదంగా  తర్ఫీదు ఇవ్వాలని అసిఫాబాద్ స్పెషల్  సబ్  జైలు సూపెరిండేంట్  పి రామకృష్ణ రెడ్డి అన్నారు. ఆదివారం మై నేషన్ జైలు ఉత్పత్తుల శాఖ వారి ఆధ్వర్యంలోఖైదీలు   తయారు చేసినటువంటి చేతిరుమాలులను   గోలేటి టౌన్ షిప్ లో  జైలు ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని  ప్రారంభించారు.అనంతరం  మాట్లాడుతు ఖైదిలు తాయారు చేసే ఉత్పత్తులను ప్రజలందరు  ఆదరించాలని కోరారు.ఖైదీలు తాయారు చేసిన ఉత్పత్తులను ఆదరించడం వల్ల వారిలో కస్టపడి పనిచేసుకునే మనస్తత్వం  కలుగుతుంది అన్నారు.ఇలాంటి కార్యక్రమాలద్వారా ఖైదీలలో మార్పు తేవచ్చు అన్నారు.మేము కూడా జీవితములో నిలబడగలమనే భావన ఖైదీలకు కలుగుతుందని అయన అన్నారు. ఈ కార్యక్రమములో రెబ్బెన ఎసై శివకుమార్, జైల్ సిబ్బంది అబ్బాస్ విజయ్  తదితరులు  పాల్గొన్నారు.

అక్రమంగా నిర్మిస్తున్న డాంబర్ కంపెనీ నిర్మాణ పనులు ఆపాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 20 ; ఎలాంటి అనుమతులు  లేకుండా రాంపూర్ గ్రామ శివారులో  అక్రమంగా నిర్మిస్తున్న డాంబర్ కంపెనీ నిర్మాణ పనులు ఆపాలని రాంపూర్ గ్రామస్థులు కోరారు.   . డాంబర్ కంపెనీ రాంపూర్ గ్రామానికి దగ్గర గా  ఉండటం మూలాన గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది అన్నారు. డాంబర్ కంపెనీ నుండి వెలువడే కలుషుతమైన గాలి,దుమ్ము,దూళి చిన్నపిల్లలకు,ప్రజలకు అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది అన్నారు.కంపెనీ యాజమాన్యానికి  గ్రామపంచాయితీ అనుమతి నిరాకరించిన కూడా వారు లెక్కచేయకుండా పనులను కొనసాగిస్తున్నారు అన్నారు.గ్రామ ప్రజలమంతా కలసి వెళ్లి కంపెనీ యాజమాన్యానికి డాంబర్ వల్ల కలిగే నష్టాల గురించి వివరించగా పగటి పూట పనులు అపి,రాత్రిపూట పనులు చేపడతాం అని అంటున్నారు అన్నారు.దీని పై ఎన్ని సార్లు కంపెనీ యాజమాన్యాన్ని ఇక్కడ డాంబర్ కంపెనీ వద్దు అన్న కూడా వారు మా గ్రామ ప్రజల మాటను పెడచెవిన పెడుతు,గ్రమపంచాయితి అనుమతి లేకున్నా పనులను కొనసాగిస్తున్నారని ఇప్పడికైనా అధికారులు స్పందించి డాంబర్ కంపెనీ నుండి  రాంపూర్ గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితిని కాపాడాలని  గ్రామస్థులు చాపిడి యాదవ్,డోంగ్రి పోచయ్య,చాపిడి ప్రభాకర్,చాపిడి సోమయ్య,డోంగ్రి గజానంద్,చాపిడి జగన్నాద్,చాపిడి ధర్మయ్య,డోంగ్రి తుకారాం,చునార్కర్ ధర్మయ్య,చునార్కర్ లింగయ్య,దశమికి శెంకరయ్య,డోంగ్రి ఆనందరావు,చల్లూరి దేవాజి,దుర్గం బాపు,దుర్గం హరిలాల్   తదితరులు కోరారు.   

త్రాగునీటి సమస్యపై స్పందించని పంచాయతీ సెక్రటరీ ; అజ్మీరా రామ్ నాయక్




 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 20 ;  మాధవాయ్ గూడలో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని గ్రామస్తులు తెలపడంతో పంచాయతీ సెక్రటరీని సంప్రదించగా సరైనస్పందన లేదని బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అజ్మీరా రామ్ నాయక్ అన్నారు. ఆదివారం రెబ్బెన మండలంలోని పలు గ్రామాలలో సమస్యలను తెలుసుకునేందుకు   పర్యటించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ మాధవాయ్ గూడలో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని తేలడంతో పంచాయతీ సెక్రటరీని సంప్రదించగా సరైనస్పందన లేకపోవడంతో సమస్యను జిల్లా పంచాయతీ అధికారి,  జిల్లా పాలనాధికారి దృష్టికి చరవాణి ద్వారా సమస్యను వివరించినట్లు తెలిపారు. పాలనాధికారి త్వరలోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు.  లక్ష్మి పుర గ్రామంలో పెన్షన్ సమస్యలు అధికంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. పుంజుమ్మెరాగూడ గ్రామంలో మిషన్ కాకతీయ చెరువు ప్రమాదకరంగా ఉందని గ్రామస్తులు తెలపడంతో ఎస్ సి గుణవంతరావు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ బృందంలో బీజేవైఎం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురాపు సంజీవ్, బీజేపీ కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షులు ఎలమంచిలి  సునీల్ చౌదరి,  వాడై గుండయ్య, చౌదరి తిరుపతి, శ్రీనివాస్, దిలీప్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. 

Saturday, 19 May 2018

ఓపెన్ కాస్ట్ గనులను సందర్శించిన సింగరేణి డైరెక్టర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 19 ; అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలనీ సింగరేణి డైరెక్టర్ భాస్కర్ రావు అన్నారు.  : బెల్లంపల్లి ఏరియా లోని  డోర్లి ఓసిపి-1, ఖైరుగూడ ఓసిపి, బిపిఎ -ఓసి -2 ఎక్స్టెంటు గనులను శెనివారం డైరెక్టర్ పిపి భాస్కర్ రావు మరియు ఎస్ సి ఎల్ అడ్వైజర్ మైనింగ్ డీఎన్ ప్రసాద్ లు బెల్లంపల్లి ఏరియా జియం రవి శెంకర్ తో కలిసి సందర్శించారు.ఈ సందర్బంగా వారు ఉత్పత్తి, మైనింగ్ ప్లాన్,రక్షణ,కోల్ లింకేజి మరియు నాణ్యత విషయాలపై ఏరియా అధికారులకు మార్గదర్శకాలు చేసారు.రాబోయే రోజుల్లో బెల్లంపల్లి ఏరియా గోలేటి ఓపెన్ కాస్ట్ మరియు చింతగూడ ఓపెన్ కాస్టుకు  సంబందించిన పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. అంతకుముందు జియం కార్యాలయంలో ఏరియా లోని అన్ని ప్రాజెక్టుల పి ఓల తో ప్లానులపై  చర్చించారు.ఓబీ మరియు కోల్ కాంట్రాక్టర్లకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓటు జియం ఎం శ్రీనివాస్,ప్రాజెక్టు ఆఫీసర్లు కె కొండయ్య,జి మోహన్ రెడ్డి, సి హెచ్ శ్రీనివాస్,ఏరియా ఇంజనీర్ రామారావు,కాలరీ మేనేజర్ లు ఎన్ ఉమాకాంత్,రమేష్,ఎల్ రమేష్ లు,సర్వే ఆఫీసర్ టి రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.                         



నిషేధిత పాలిథిన్ కవర్లు, గుట్కా, బెల్లం మరియు కలప నిల్వ పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 19 ;  అక్రమ గుట్కా, బెల్లం మరియు కలప నిల్వలు రెబ్బెన లోఉన్నాయనే  ఖచ్చితమైన నిఘా  సమాచారం తో టాస్క్ ఫోర్స్  సి. ఐ  రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్  లు గ్రామంలో తనిఖీ చేయగా సబ్ స్టేషన్ రోడ్డులోని సయ్యద్ అఫ్ఫు ఇంట్లో సుమారు 1000/- ల విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు,అనంతరం  ప్రగతి నగర్ లోని కొలిపాక కిరణ్ కుమార్ కిరాణా  దుకాణంలో  తనిఖీ నిర్వహించగా 3,500/- విలువ చేసే 85 కిలోల బెల్లం, 1,316/- విలువగల గుట్కా ప్యాకెట్లు, 1,680/- విలువగల నిషేధిత(0.8 మైక్రాన్ల కన్న ఎక్కువ ఉన్న) పాలిథిన్ కవర్లు మరియు 48,000/- విలువగల 20 ఫీట్ల టేకు కలప స్వాధీనం చేసుకొని వీటన్నింటిని తదుపరి విచారణ నిమిత్తం  రెబ్బెన పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగిందన్నారు.

Friday, 18 May 2018

పంచాయతీ ఎన్నికలపై పాలనాధికారి సమీక్ష సమావేశం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 18 ;  తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలలు దగ్గరపడడడంతో కొమురంభీం  ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్  పాటిల్  సమావేశమందిరంలో ఎంపీడీఓ లతో శుక్రవారం  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామా పంచాయతీ వారీగా ఎస్ సి, ఎస్ టి, బి సి ల గణన వార్డుల వారీగా  తయారు చేయాలని అన్నారు. పోలింగ్ స్టేషన్లను ప్రభుత్వ భవనలలోనే  ఏర్పాటు చేయాలనీ , అందుబాటులో  లేనప్పుడే ప్రైవేట్ భవనాలలో ఏర్పాటు చేయాలన్నారు.ఎన్నికలకు అవసరమయ్యే సిబ్బంది  సంఖ్యా గురించి ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. పోలింగ్ కేంద్రాల సమాచారం ముందుగానే ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి పి  ఓ గంగాధర్, ఎంపీడీఓ లు అధికారులు పాల్గొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ; ఎమ్మెల్యే కోవాలక్ష్మి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెనమే 18 ;  గత ప్రభుత్వాలు చేయలేని సంక్షేమాలతో తెలంగాణ ప్రభుత్వం రైతులను ఎంతో ఆదుకుంటూ రైతు బంధు పథకం కింద చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే కోవాలక్ష్మి అన్నారు. శుక్రవారం మండలంలోని ఖైరిగాం,రెబ్బెన,పులికుంట,గంగాపూర్ గ్రామాల్లో రైతు బందు పథకం చెక్కుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. రెబ్బెన అతిథి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతు  రైతుల పంట పెట్టుబడి కోసం కొమురంభీం జిల్లాకు 125 కోట్ల రూపాయలు విడుదల చేసి రైతు బందు పథకాన్ని  గత ఎనిమిది రోజుల నుండి ప్రతి గ్రామాన రైతులకు చెక్కులతో పాటు పట్టా పాసుపుస్తకాలు పంపిణి చేపడుతున్నట్లు పేర్కొన్నారు. .ఉమ్మడి రాష్టంలో గత ప్రభుత్వాలు రైతులను ఏ రకంగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కరెంటు కష్టాలతో,సాగునీటితో రైతులు ఎంతగానో ఇబ్బందిపడ్డారు అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక మిషన్ కాకతీయ ద్వారా రైతులకు సాగునీటి కష్టాలు కరెంటు కష్టాలు తొలగిపోయాయి అన్నారు.రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి రైతు బందు పథకం ద్వారా చెక్కుల పంపిణి చేస్తుంటే ఇతర పార్టీ కాంగ్రెస్ నాయకులు ప్రజా చైతన్య బస్సు యాత్ర పేరుతో ప్రజల వద్ద మోసపూరిత ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర  ప్రజలకు ఏ ప్రభుత్వాలు మంచి చేసాయి  అన్న సంగతి ప్రజలకు తెలుసన్నారు.పంటల పెట్టుబడికి ఒక్క ఎకరానికి రెండు పంటలకు 8 వేలు ఒక్క  సంవత్సరం మాత్రమే ఇచ్చి మరచిపోయే పథకం కాదని తెరాస ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు రైతు బంధు పథకం అండగా ఉంటుందన్నారు.  అదేవిదంగా రెబ్బెన మండలంలో సుమారు 7 కోట్ల వ్యయంతో అంతర్గత రహదారుల అభివృద్ధి  చేపట్టామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో ప్రయోజక పథకాలను ప్రెవేశపెట్టారని అందులో,కల్యాణ లక్ష్మి, షాదిముబారక్, గొర్రెల పంపిణి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పింఛను,దళితులకు మూడెకరాల భూమి వాటితో పాటు దేశంలోని ఏ రాష్టంలో చేపట్టని మహోన్నత కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు బందు పథకం ప్రవేశ పెట్టి రైతు ప్రభుత్వం గా రైతులకు అండగా ఉంటుందన్నారు. .అన్నదాతను ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి రైతుల కండ్లల్లో ఆనందం చూస్తున్నారు అన్నారు .పంటల సాగుకు రైతులు అప్పులు చేయకుండా ఉండేందుకు రైతు బందు పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అజ్మెర బాబు రావు, ఎంపిపి కర్నాతం సంజీవ్,రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ, వైస్ ఎంపిపి గోడిసెల రేణుక, రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, ఏడి శ్రీనివాస్,మండల వ్యవసాయాధికారిని మంజుల,సహాయ వ్యవసాయాధికారి అర్చన, ఆర్ఐ ఊర్మిళ, విఆర్ఓ ఉమ్లాల్,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ  వైస్ చెయిర్మన్ కుందారపు శెంకరమ్మ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బోరుకుతే నాగయ్య,నాయకులూ చెన్నసోమ శేఖర్, చిరంజీవి గౌడ్, మడ్డి  శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

రవాణాకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 18 ;   రెబ్బెన  ఆసిఫాబాద్ రోడ్     రైల్వే స్టేషన్ ఆవరణలో  రామగిరి ట్రైన్ లో రవాణా చేయటానికి సిద్ధంగా ఉన్న  రేషన్ బియ్యం నిల్వలను టాస్క్ ఫోర్స్ సి. ఐ రాంబాబు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.   ఖచ్చితమైన నిఘా  సమాచారం తో  ఎస్పీ కల్మేశ్వర్ సింగన్ వార్  ఆదేశాల మేరకు  రైల్వే స్టేషన్ ఆవరణలో తనిఖీ చేయగా   గౌరిశెట్టి లక్ష్మణ మూర్తి, ఎనగందుల లక్ష్మి, కనక లచ్చమ్మ మరియు దుర్కి పోసు అనే నలుగురు వ్యక్తులు  రవాణాకు సిద్దంగా ఉంచిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం  రెబ్బెన పి.ఎస్. కు   అప్పగించడం జరిగింది అన్నారు. ఈ దాడిలో  టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు ఉన్నారు. 

Thursday, 17 May 2018

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన) మే 17 ; రైతుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టి రైతులను ఆపద్బాంధవుడి లాగా ఆదుకుంటున్నారని అన్నారు. డిఆర్ఓ కదం సురేష్  అన్నారు. రైతు బందు పథకంలో భాగంగా గురువారం రెబ్బెన మండలలంలోని ఎడవెల్లి,  నారాయణపూర్ గ్రామంలో ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు మరియు పట్టా పాసుపుస్తకాలు పంపిణి కార్యక్రమం నిర్వహించారు. .అనంతరం వారు మాట్లాడుతు రైతులు పండించే పంటలకు పెట్టుబడి సహాయం కొరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బందు పథకం ద్వారా లబ్దిపొందుతున్న రైతు కండ్లల్లో ఆనందం వెళ్లి విరుస్తుంది అన్నారు.
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టని మహోన్నత కార్యక్రమాన్ని రైతుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టి రైతులను ఆపద్బాంధవుడి లాగా ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాధం సంజీవ్ కుమార్,  జడ్పిటిసి అజ్మేర బాపూరావు వ్యవసాయ అధికారిని మంజుల, ఏఈఓ అర్చన, రెవెన్యూ సిబ్బంది ఉమ్లాల్, నాయకులూ పల్లె రాజేశ్వర్,భీమేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.  

ఎన్ని అడ్డంకులు సృష్టించిన భాజపాదే విజయం ; బోనగిరి సతీష్ బాబు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన) మే 17 ;.కర్ణాటకలో బిజెపి గెలుపునకు వ్యతిరేకంగా ఇతర పార్టీ నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆఖరకు వారు  మట్టి కరవడం జరిగిందని.జపాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోనగిరి సతీష్ అన్నారు. గురువారం  రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  అయన మాట్లాడుతు కాంగ్రెస్ ముక్త భారతకి నిదర్శనమే కర్ణాటకలో బిజెపి విజయం అని కాంగ్రెస్ దేశానికి క్యాన్సర్ లాంటి రోగం దాన్ని కుక్కటి  వేళ్లతో పెకిలించడమే మోదీ ఆశయం అన్నారు.దానికి తోడుగా కర్ణాటక ప్రజలు అందరూ ముక్తకంఠంతో అతి పెద్ద మెజార్టీతో కర్నాటకలో భాజపాను గెలిపించి తమవంతు ధర్మాన్ని చాటుకున్నారు.బిజెపి గెలుపే ఇతర రాష్ట్రాల్లో  గెలుపునకు నాంది అని అన్నారు. కార్యకర్తలు,జాతీయఅధ్యక్షుడు అమితాషా మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కఠోర దీక్ష, శ్రమ దేశంలోని ప్రజల కోసం అభివృద్ధి పథకాల విజయం అని అన్నారు. అదేవిధంగా రాబోయే 2019 సంవత్సర ఎన్నికల్లో   మరోసారి దేశవ్యాప్తంగా బిజెపి విజయ డంకా మోగిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో  జిల్లా ప్రధాన కార్యదర్శులు కేసరి ఆంజనేయులుగౌడ్, చర్ల మురళి, బిజెపి మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ, బిజెవైయం మండల అధ్యక్షులు ఇగురపూ సంజివ్ లు పాల్గొన్నారు.

దళితులపై ఎన్ని అఘాయిత్యాలు జరిగిన పట్టించుకోని ప్రభుత్వాలు : మందకృష్ణ మాదిగ


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన) మే 17 ; దళితులపై ఇప్పటికీ అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం  పట్టించుకోవడం లేదు అని మందకృష్ణ అన్నారు.  గురువారం రెబ్బెన ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేశారు అనంతరం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎస్సి ఎస్టీ పరిరక్షణ సదస్సులో అయన మాట్లాడారు.  దళితులను అణగదొక్కడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపన్ని అట్రాసిటీ నిర్విరామం  చేస్తుందన్నారు దీన్ని కాపాడుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు ఏకం కావాలని అయన  పిలుపునిచ్చారు ఎం హెచ్  మరియు గుజరాత్ రాష్టాల్లో  పదకొండు మంది దళితులను  చంపినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. కేంద్రం కూడా దళితులపై వివక్ష చూపుతుంది అని అన్నారు.  న్యాయ వ్యవస్థ దళితులను అణగదొక్కాలని చూస్తుందని విమర్శించారు. అట్రాసిటీ యాక్టు ఉన్నప్పుడే రక్షణ లేకుండా పోతుంటే సుప్రీంకోర్టు ఆ ఒక్క యాక్ట్ అవసరం లేదని తీర్పు చెప్పడం వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందన్నారు.  కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుంటే ఇప్పటికే స్పందించేదన్నారు.  దేశంలోని ఎస్సీ ఎస్టీలను ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్లో జరిగే  దళిత గిరిజన, సింహగర్జన మహాసభ నిర్వహిస్తున్నామని దానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జి చెన్నయ్య, దుర్గం గోపాల్, సొల్లు లక్ష్మి, దుండ్ర శ్రీనివాస్, దుర్గం సోమయ్య, రేగుంట కేశవరావు, కొయ్యల హేమాజీ, గద్దల బానయ్య, అజ్మీర బాబురావు, ఆత్మారాం, శోభన్ బాబు, కొట్నాక విజయ్ కుమార్, రజీహైదర్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 16 May 2018

నాలాలో పడి వృద్ధురాలి మృతి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 16 ;  రెబ్బెన మండలం కొండపల్లి గ్రామా శివారులో గల  ప్రధాన రహదారిపైగల వంతెన కింద గల  నీటి గుంటలో పడి సోనుల్లే  తనుబాయి (75) చనిపోయిందని బుధవారం రెబ్బెన ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా మతిస్తిమితంలేక తన రెండవ కుమారుడైన శంకర్ ఇంట్లోనివసిస్తున్నదని, రెండురోజులక్రితం ఇంటినుండి బయటకు వెళ్లిందని కుటుంబసభ్యులు అంతట వెదికినా ఆమె  సమాచారం లభ్యం కాలేదన్నారు. బహిర్భుమికి వెళ్లి కళ్ళు సరిగా కనిపించక  ప్రమాదవశాత్తు నాలా లో పడి  చనిపోయి ఉండవచ్చని భావించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

రైతు బంధు పథకం ద్వారా చెక్కుల పంపిణీని


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 16 ;   తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా చెక్కుల పంపిణీని   రెబ్బెన మండలం లోని నేర్పల్లి , కొమురవెల్లి, గ్రామాలలో బుధవారం నిర్వహించారు.  ఈ గ్రామాలలో   ఎంపిపి సంజీవ్ కుమార్ తహసీల్దార్ సాయన్న ఏవో మంజుల లు  రైతు బంధు చెక్కులు,కొత్త పట్టా పాసుపుస్తకాలు పంపిణి చేసారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పంటల పెట్టుబడికి ముందస్తుగా   ఇస్తున్న చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  , రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్,  వి ఆర్ ఓ ఉమ్లాల్,  ఆర్ ఐ ఊర్మిళ ,  ఏ ఈ ఓ అర్చన , ఏఈఓ రాకేష్,  నాయకులు వి రమేష్ పి శ్రీనివాస్ గౌడ్, వి శ్రీనివాస్ ,చెన్న సోమశేఖర్ రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

Tuesday, 15 May 2018

ప్రియుడితో భర్తను చంపిన భార్య


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 15 ; రెబ్బెన మండలములో అక్రమ సంభందముతో ఓ వ్యక్తిని  గొంతు పిసికి ఉరి వేసి చంపినా సంఘటన సంచంలనం సృష్టించింది.  .ఆసిఫాబాద్ సి ఐ బాలాజీ వార ప్రసాద్ మంగళ వారం  తెలిపిన వివరాల ప్రకారం   దుర్గం నరసయ్య (35) ను అతని భార్య జ్యోతి , అదే గ్రామానికి  ప్రియుడు శ్రీనివాస్తో కలిసి సోమవారం రాత్రి గొంతు పిసికి  చంపినట్లు తెలిపారు. నర్సయ్య   జ్యోతిలు గత కొన్ని సంవత్సరాలగా వివాహం  చేసుకుని భార్యాభర్తలుగా జీవనము  సంతోషంగా కొనసాగిస్తున్నారు.  కొంతకాలంగా అదే గ్రామానికి  శ్రీనివాస్ అనే ప్రియుడి తో అక్రమ సంబంధం  ఏర్పర్చుకున్నాక్రమంలో   విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలిపారు.  సోమవారం రాత్రి మృతుడి భార్య  జ్యోతి ప్రియుడు  శ్రీనివాస్ తో  కలిసి గొంతు పిసికి   దూలానికి ఉరి  వేశారని,  ఉరివేసుకుని చనిపోయినట్లు నాటకమాడి 108 ఆంబులెన్సు లో   ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు పేర్కొన్నట్లు,  విచారణలో దుర్గం నరసయ్యను గొంతు పిసికి చంపినట్లు తేలిందని అన్నారు. మృతుడికి ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఉన్నారు.  ఈ మేరకు  ఎస్ ఐ శివ  కుమార్ కేసు నమోదు చేస్తుకున్నట్లు తెలిపారు.

డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు తేదీని పొడిగించాలి ; ఏ ఐ ఎస్ ఎఫ్ డిమాండ్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 15 ; తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  డిగ్రీ ప్రవేశాలకు చేపడుతున్న  దరఖాస్తు తేదీని పొడిగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున గోలేటి లోని కేఎల్ మహేంద్ర భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిగ్రీ ఆన్ లైన్ సర్వీస్ తెలంగాణ డి ఓ ఎస్ టి  కు దరఖాస్తు చేసుకోవాలంటే ముందే కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు అవసరం రావడం వలన కొందరి విద్యార్థులకు అవి అందుబాటులో లేకపోవడం, రెవెన్యూ అధికారులు చెక్కులు పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేయడంలో తీరిక లేక ఉండడం వలన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందడంలో   తీవ్ర జాప్యం జరుగుతోంది అని అన్నారు. అదే విధంగా ఆధార్ కార్థులకు చరవాని నెంబర్ లింక్ వంటి అంతర్జాలా సమస్యలు తలెత్తడం ఆధార్ క్రమబద్ధీకరణకు చాల రోజుల సమయం పడుతుందని, కానీడి ఓ ఎస్ టి  దరఖాస్తు కు ఈ నెల 26వ తేదీ చివరి తేదీ వరకు మాత్రమే ఉందని, దరఖాస్తు తేదీని వెంటనే పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పటివరకు కేవలం 20 శాతం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని ఇంకా చాలా మంది విద్యార్థులు అనేక సమస్యలు ఉండడం వలన,  సమయం తక్కువ ఉన్నందున  డిగ్రీ ఆన్ లైన్ దరఖాస్తు తేదీని ఖచ్చితంగా పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్, మండల అధ్యక్షులు మలిశెట్టి మహిపాల్, గోలేటి పట్టణ అధ్యక్షులు జాడి సాయికుమార్, నాయకులు జెటంగుల సంజయ్ కుమార్, నవీన్, శివసాయి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు మేలు కోరే ప్రభుత్వం ; జెడ్పిటిసి బాపూరావు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 15 ; తెలంగాణ  ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు రైతులందరికీ ఎకరానికి 4000/-వేలు చొప్పున చెక్కులను జారీ చేయడం సంతోషకరమని జడ్పిటిసి బాపురావు అన్నారు. మంగళవారం  రెబ్బెన: మండలంలోని గోలేటి గ్రామంలో రైతు బందు పథకంలో చెక్కులు పంపిణి కార్యక్రమంలో మాట్లాడారు.  రైతులందరికీ ఎకరానికి 4000/-వేలు చొప్పున చెక్కులను జారీ చేయడం.పంట పండించే రైతులకు పెట్టుబడి విషయం లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఆశతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బందు పథకాన్ని ప్రవేశపెట్టి వీటిని రైతులు పంట పెట్టుబడికోసం స్వద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే రాబోయే రోజుల్లో రైతులకు పెద్ద పీట వేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టనుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన తహశీల్ధార్ సాయన్న,మండల వ్యవసాయ అధికారిని మంజుల,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ,  గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్,ఎంపిటిసిలు  సురేందర్ రాజ్,మురళి బాయ్, రైతు కమిటీ ఛైర్మెన్ సుబ్బారావు మరియు గ్రామ రైతులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Monday, 14 May 2018

వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్నిఅధిగమించినందుకు మిఠాయిల పంపిణి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 14 ; రెబ్బెన మండలం గోలేటి క్రాస్  రోడ్ వద్ద గల సి ఎస్ పి  లో గోలేటి జీఎం  కార్మికులకు సోమవారం మిఠాయిల పంపిణి చేసారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా పరిధిలో  2017-18 కి గాను వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించినందుకు  గాను ఏరియాలోని  అన్ని గనులలో మరియు డిపార్టుమెంట్  లలో  కార్మికులకు మిఠాయిలు  పంపిణి చేసారు. ఈ సందర్భంగా జీఎం   రవిశంకర్ మాట్లాడుతూ కార్మికులు ఈ సంవత్సరంకూడా వార్షిక నిర్దేశిత ఉత్పత్తి  లక్ష్యాన్ని అధిగమించాలని  అన్నారు. కార్మికుల, ఉద్యోగుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని అన్నారు. సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తి మాత్రమే కాకుండా కార్మికుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ  కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ  జీఎం  శ్రీనివాస్, డిజైన్ పర్సనల్ కిరణ్, టీజీబీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రావు, విశ్వనాధ్, సుదర్శనం తదితర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. 

గ్రామసభకు అధికారుల గైర్హాజరీపై నిరసన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 14 ; బిసి కార్పోరేషన్ రుణాలు మంజూరు కోసం ప్రత్యేకంగా రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీ లో సోమవారం  గ్రామ సభ నిర్వహించారు.   హజరు కావలసిన యంపి డివో.  ఉన్నతాధికారులు  హజరు కాకపోవడం, కేవలం పంచాయతీ కార్యదర్శి మాత్రమే హాజరు కావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సభ్యులు నిరసన తెలిపారు.  మండల తహసీల్దార్ సాయన్న ఉన్నాత అధికారులతో  మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా  బిసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు కేసరి ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ సభలను నిభందనలమేరకు నిర్వహించడం లేదని అన్నారు. అధికారులు  కేవలం అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు  మాత్రమే రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో  కార్యదర్శి భోగె ఉపేందర్, గోలేటి యంపిటిసి మద్దెల సురేందర్ రాజు, ఏ ఐ ఎస్ ఎఫ్  నాయకులు దుర్గం రవి. పూదరి సాయిలు   నేలపై కూర్చొని నిరసన తెలిపారు.

బిసి కార్పొరేషన్ రుణాల పేరుతో మోసం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 14 ; కార్పొరేషన్ రుణాల పేరుతో నిరుద్యోగ యువతి యువకులను మోసం చేస్తున్నరని రెబ్బెన యువజన కాంగ్రెస్ నాయకులు  వస్రం  నాయక్  అన్నారు. సోమవారం రెబ్బెన  మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోమాట్లాడారు.   బిసి    బిసి కార్పొరేషన్ రుణాలపై మాట్లాడుతు 2017-2018 సంవత్సరానికి గాను నిరుద్యోగ యువతీ యువకులకు బిసి కార్పొరేషన్ రుణాలను అందిస్తామని దరఖాస్తులను స్వీకరించి స్థానిక బ్యాంకు మేనేజర్ మరియు ఎంపిడిఓలు  ఇంటర్వూలు  చేపట్టకుండానే  స్థానిక గ్రామ  పంచాయితీ సెక్రటరీ  దరఖాస్తు  పత్రాలను పరీక్షించి లబ్ధిదారుల పత్రాలను తిరిగి లబ్దిదారులకు అందించి వెళ్లి బ్యాంకు అధికారితో సంతకం చేపించి ఎంపిడిఓ కార్యాలయం లో అందజేయమనడంలో బిసి కార్పొరేషన్ రుణాల్లో  అవకతవకలు ఎంతగా జరగబోతున్నాయో అని తెలుస్తుంది అన్నారు. అర్హులైన  లబ్దిదారులు  నిరుద్యోగ యువకులు ఈ పరిణామాల వల్ల నిరుత్సాహానికి గురవుతున్నారని .ఇప్పడికైనా సంబంధిత అధికారులు రుణాలపై  ఎలాంటి అవకతవకలు జరగకుండా అర్హులకు  రుణాలు అందేవిదంగా చూడాలని అలాగే  2015-2016 సంబందించిన దరఖాస్తులను స్వీకరించిన ప్రభుతం ఇప్పటి  వరకు రుణాలను మంజూరు చేయడం లేదన్నారు.కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం యువకుల నుండి దరఖాస్తులను స్వీకరించి యువతతో ప్రభుత్వం పరిహాసాలు ఆడుతుందని ఘాటుగా  విమర్శించారు.ముందు ముందు తెలంగాణ యువత అన్ని గమనిస్తుంది అని రాబోయే ఎన్నికల్లో యువత  తగిన బుద్ది చెప్తుందని అన్నారు.అంతే కాకుండా రైతు బందు పథకం భూస్వాములకు మాత్రమే ఎకరానికి 4 వేలు ఇస్తూ కౌలు రైతులకు ఎటువంటి ప్రోత్సహకాన్ని గాని,గిట్టు బాటు ధర కానీ రాకపోవడం తో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.ఇప్పటికైనా కౌలు రైతులకు న్యాయం చేసే విదంగా చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో సంతోష్,శేఖర్,రంజిత్,భాస్కర్,కాంతారావు,గొండయ్య తదితరులు పాల్గొన్నారు.                             

Sunday, 13 May 2018

రైతు బందు పథకం రైతులకు ఎంతో ఆసరా ; ఎమ్మెల్యే కోవలక్ష్మి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 13 ; రైతు బంధు పథకం ద్వారా  రైతులకు పంపిణీ చేస్తున్న సొమ్ము వ్యవసాయానికి  ఎంతో ఆసరాగా ఉంటుందని,  ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్  ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. రెబ్బెన మండలంలోని నంబాల గ్రామంలో ఆదివారం  రైతు బంధు పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా రైతులకు మొదటి పంటకు  ఎంతో  ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగారా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలైన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ లను ప్రారంభించిందని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనిమ్ అన్నారు. ఈ కార్యక్రమంలోరెబ్బెన ఎం ఆర్ ఓ  సాయన్న, ఎంపీపీ కర్నాధం సంజీవ్ కుమార్, నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ,  వ్యవసాయాధికారిని మంజుల, ఎంపీటీసీ  వనజ, వ్యవసాయ కమిటీ మండల అధ్యక్షులు బొర్కుటే  నాగయ్య, టిబిజికె ఎస్ నాయకులూ శ్రీనివాస రావు, సింగల్ విండో డైరెక్టర్ సత్యనారాయణ, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.