కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 2 ; రెబ్బెన ఉద్యం అభిలాష శిక్షణ కేంద్రం ను నేటి నుండి 07 వ తేదీ వరకు 5రోజుల పాటు 8వ తరగతి ఆపై అర్హత కలిగిన 20 నుండి 40 సంవత్సరాల వారికి ఉచితంగా అందించే ఎంటర్ ప్రేనిర్ షిప్ శిక్షణను ను సద్వినియోగం చేసుకోవాలని రెబ్బెన మండలకొండపల్లి గ్రామంలో గల డిజిటల్ సేవ కేంద్రం- కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు దుర్గం పవన్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యం అభిలాష వ్యవస్థాపక అవగాహన కార్యక్రమం లో భాగంగా రోజుకు 3 గంటల చొప్పున శిక్షణను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు, శిక్షణ అనంతరం సర్టిఫికేట్స్ తో పాటు ఉద్యం మిత్ర పథకం ద్వారా రుణ సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఆధార్ కార్డ్, పాస్ ఫోటో, ఇతర వివరములతో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. వివరాలకు 8106289068 నెంబర్ పై సంప్రదించాలని సూచించారు.
Anna 4th nundi ravacha
ReplyDelete