రెబ్బెన ; ప్రజలు తమకు కల్పించిన రక్షణ చట్టాలపై అవగాహన పెంపొందించుకోని చట్టపరిధిలో ప్రవర్తించాలని రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం రెబ్బెన ఆర్ట్స్ అండ్డ్ సైన్స్ కళాశాలలో షీ టీం లపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినులను, మహిళలను ఎవరైనా మానసికంగాకానీ,సోషల్ మీడియాద్వారాకాని, , లైంగికంగాకాని, వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఇటువంటి హింసకు గురైనవారు వెంటనే పోలీస్ స్టేషన్, షీ టీం లకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆన్నారు. విద్యార్దినులు మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాను మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా షే టీం ఇంచార్జి షఫియుద్దీన్ , రజిత, శ్రీనివాస్, సునీత, , కళాశాల ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని, అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment