కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 4 ; తెలంగాణా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మరియు గుర్తింపు సంఘం టిబిజికెఎస్ కలసి సంస్థను ఉద్దేశ పూర్వకంగా ప్రైవేట్ పరం చేస్తున్నాయని ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి మిర్యాల రంగయ్య అన్నారు. గురువారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి గనుల వద్ద జరిగిన గేట్ మీటింగ్ లలోమాట్లాడుతూ సంస్థను ప్రయత్నపూర్వకంగా ప్రైవేట్ వారికి అప్పచెప్పే ప్రయత్నం జరుగుతున్నదని దీనిని కార్మికులందరూ గమనించి తగిన బుడ్డి చెప్పాలన్నారు. మాన్ పవర్ లేదనే సాకుతో ఓ బి తీసివేతకు ప్రైవేట్ వారికి అప్పగిస్తే స్తే వారు మట్టితో పాటు బొగ్గును కూడా తరలించి అమ్ముకొంటున్నారని ఆరోపించారు. పరిస్థితిని అర్ధంచేసుకోకపోతే ఎం పి , ఎం ఎల్ ఏ , మరియు నాయకులూ బినామీ పేర్లతో సింగరేణిని దోచుకునే ప్రమాదం ఉందన్నారు. కార్మికుల కష్టార్జితమైన సంస్థ లాభాలను సీ ఎస్ ఆర్ పథకం కింద ఇష్టారాజ్యంగా వాడుకొంటున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్నింటిని కార్మికులందరికీ వివరించడం జరిగిందని గుర్తుచేశారు. నాలుగేళ్ళ తెరాస పాలనలో కార్మికులకు ఒరిగిందేమి లేదని అన్నారు. కారుణ్యనియామకాలు సరిగ్గా జరగడంలేదని విమర్శించారు. కార్మికులనుఆన్ ఫిట్ చేయడం లేదని అన్నారు. రాబోయే ఎన్నికలలో కార్మికులు ఓటు ను అమ్ముకోవద్దని, సరియైన పార్టీ కి వోట్ చేసి సంస్థను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చిప్ప నర్సయ్య, బయ్యా మొగిలి, ఎస్ తిరుపతి,జగ్గయ్య, నరసింహ రావు, జూపాక రాజేష్, దివాకర్, చుంచు రాజన్న, చంద్రయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment