రెబ్బెన : రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమని ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు జ్ బి పౌడెల్ అన్నారు. గురువారం జిల్లాలోని అన్నిమండలాలలో భారీ బైక్ రల్ల్య్ నిర్వహించిన అనంతరం రెబ్బెన మండలంలోని గోలేటిలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు బీజేపీ కి పట్టంగట్టాడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. గత నాలుగేళ్ళ పాలనలో తెరాస ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని, చేసిన హామీలైన దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల ను కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీలనుంచి బీజేపీ లో చేరిన యువకులను, నాయకులను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎలమంచిలి సునీల్ చౌదరి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు విశాల్ ఖాండ్రే , పార్టీ మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి మల్రాజ్ రాంబాబు, అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి, యువనాయకుడు అజమీర ఆత్మారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment