Tuesday, 9 October 2018

సాగు నీటికై రహదారి దిగ్బంధం


 కొమురంభీం ఆసిఫాబాద్  అక్టోబర్ రెబ్బెన 09 : రెబ్బెన మండల శివారులోగల ఖైర్ గాం  గ్రామంలో వట్టివాగు కాలువ కింద  సాగవుతున్న పంట పొలాలకు  సాగు నీరందించాలని రైతులు డిమాండ్ చేస్తూ మంగళవారం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా  అంతర్రాష్ట్రుయ రహదారిపై వాహనాలు భారీగా బారులు తీరాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వట్టివాగు ప్రాజెక్టు కింద  గత కొద్ది రోజుల నుంచి డి  6, డి 5  కెనాల్ పన్నెండు వరకు రెబ్బెన మండలంలో సుమారు ఐదు వేల ఎకరాలు సాగవుతుందని  తూముల తలుపులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడంతో బేసిక్స్ నుంచి ఎగువ ప్రాంతాల పొలాలకు సాగునీరు అందటం లేదన్నారు.  మరో  నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందటం లేదని నీరందకపోవడంతో ఎండిపోయే దశకు చేరుకున్నాయని అన్నారు సమస్యను ఇప్పటికే ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండాపోయిందని అన్నారు పొలాలన్నింటికీ సాగునీరు అందించాల్సిన అధికారులు పట్టించుకోపోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు నీరులేక పంట పొలాలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని ఎవరూ పట్టించుకోలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటకు సాగునీరందించాలని కోరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు పొలాలకు సాగునీరు నీరందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

No comments:

Post a Comment