కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 26 ; శాసనసభ ఎన్నికల్లో అసిఫాబాద్ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్, కరీంనర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ లు కోరారు శుక్రవారం రెబ్బెన మండలంలోని గంగాపూర్, లక్ష్మిపురం, పాసిగం , వరదలు గూడా తుంగేదా తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడారు ఆయా గ్రామాల్లోగడప గడపకు తిరుగుతూ ఎన్నికలలో తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టిందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు రైతు బందు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళల పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతోందని రానున్న ఎన్నికల్లో తెరాస ను గెలిపిస్తేనే పెన్షన్లు డబుల్ చేయడం జరుతుందన్నారు. లక్ష రూపాయల వరకు రైతుల రుణాన్ని మాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి కల్పిస్తామని రైతు బందు సహాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ ను ఓడించాలనే ఉద్దేశ్యంతో నాలుగు పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు వస్తున్నాయన్నారు. అది మహాకూటమి కాదని మాయా కూటమి అని వారిని గెలిపిస్తే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు . ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో జిల్లా ను సాధించి ప్రజల వద్దకే పాలన తీసుకురావటం జరిగిందని అన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మించామన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ విజయ్ రెడ్డి, అరిగల నాగేశ్వరరావు, ఎంపిపికి సంజీవ్ కుమార్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి , మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు శంకరమ్మ, నవీన జైస్వాల్, , సోమశేఖర్, రాజేశ్వర్రావు, భాస్కర్, నరేందర్ , చిరంజీ గౌడ్, పోచయ్య తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment