రెబ్బెన ; క్రీడలలో యువత పాల్గొని కోల్ ఇండియా పోటీలలో విజయం సాధించాలని బెల్లంపల్లి సింగరేణి ఏరియా జీఎం రవిశంకర్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి భీమన్న స్టేడియం లో సోమవారం డబ్ల్యూ పి అండ్ జి ఏ ఆధ్వర్యంలో ఏరియా బై ఏరియా క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్ర్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పోటీలలో మంచిప్రతిభ చూపి కాల్ ఇండియా పోటీలలో సింగరేణి సంస్థకు మంచి పేరుతేవాలని అభిలషించారు. ఈ రోజు జరిగిన ప్రారంభ మ్యాచ్ లో మందమర్రి ఏరియా జట్టు 170 పరుగులు చేసి ఆల్ అవుట్ కాగా బెల్లంపల్లి జట్టు 174 పరుగులతో విజయం సాధియించింది ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ కిరణ్, స్పోర్ట్స్ సూపర్ వైజర్ రమేష్, కోఆర్డినేటర్ చంద్రశేకర్, మురళి కృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment