Tuesday, 9 October 2018

కార్మికులకు ఇచ్చిన హామీల అమలు కెసిఆర్ దే ; ఎమ్మెల్సీ పురాణం సతీష్

 కొమురంభీం ఆసిఫాబాద్  అక్టోబర్ రెబ్బెన 09 : కార్మికులకు ఇచ్చిన హామీలను అన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత కెసిఆర్ దేనని  ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ఏరియాలోని రెబ్బెన మండలం  గోలేటి కైరిగూడ ఓసిపిలో టీబీజీకేఎస్ గేట్ మీటింగ్ నిర్వహించారు  ఈ సమావేశానికి ఎమ్మెల్సీతో పాటు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆసిఫ్సాబాద్  ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్యలు ముఖ్య  అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కార్మికులకు పాత్ర ఎంతో కీలకమైనదని కార్మికులపై ప్రేమతో కెసిఆర్ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించారని అన్నారు 10 లక్షల వడ్డీ లేని రుణం తెలంగాణ ఇంక్రిమెంట్ వంటి అనేక హక్కులు సాధించి పెట్టామన్నారు ఇదే తరహాలో నాలుగు సంవత్సరాలలో  టీఆర్ఎస్ ప్రభుత్వం గత పాలకులు చేయలేని అభివృద్ధిని చేసి  చూపించిందన్నారు రాష్ట్ర అభివృద్ధిని అనునిత్యం  అడ్డు పడటానికి టిడిపితో కాంగ్రెస్ తెలంగాణ జన సమితి సిపిఐ పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని కార్మికులు గమనించి ఎన్నికల్లో మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు సింగరేణి కార్మికులు మరిన్ని హక్కులు రావాలన్న సమస్యలు పరిష్కారం కావాలన్న టీఆర్ఎస్ ను మరోసారి ఆదరించి గెలిపించాలన్నారు తెరాస పార్టీలో చేరిన  పలువురు నాయకులకు  కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఈపీ ఆపరేటర్ల తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్   ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు,  కార్యదర్శి ప్రకాశరావు ఏరియా కార్యదర్శులు గంగారెడ్డి, రాంరెడ్డి, అంజయ్య, నర్సింగ్రావు, ఎంపీపీ సంజీవ్కుమార్, జడ్పీటీసీ బాబురావు, మండలాధ్యక్షుడు పోటు  శ్రీధర్  రెడ్డి తదితర నాయకులు ఉన్నారు

No comments:

Post a Comment