Thursday, 11 October 2018

అప్పుల భాద తాళలేక ఉరి వేసుకొని వ్యక్తి మృతి


కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 11:రెబ్బెన మండలం కొండపల్లి గ్రామంలో  టేకురే మొండి (55)  ఉరి వేసుకొని మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై దీకొండ   రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత 5 సంవత్సరాల క్రితం అర ఎకరం పొలం కుదువ పెట్టి 50 వేలు అల్పు తీసుకోని  క్రాప లోన్ కోసం మరొక 50 వేలు అప్పు చేసి వాటిని  చెల్లించలేక మనస్థాపానికి గురై  అప్పుల భాద తాళలేక తాగుడుకు బానిసై బుధవారం రాత్రి ఇంటినుంచి వెళ్లి భగీరథ వాటర్ ట్యాంక్ పైన లుంగీతో   ఉరి వేసుకొని మరణించినట్లు తెలిపారు. కొడుకు  రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

No comments:

Post a Comment