రెబ్బెన ; బెల్లంపల్లి ఏరియాలోని ఓసిటీలో విధులు నిర్వహిస్తున్న ఈపీ ఆపరేటర్ సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ కృషి చేస్తుందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ రావు అన్నారు. బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓసిపిలో సోమవారం ఈపీ ఆపరేటర్ల కాంట్రాక్టర్ లకు టీజీబీకేఎస్ ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాసరావు వినతిపత్రం అందజేశారు. ఈపీ ఆపరేటర్లకు సెప్టెంబర్ ఒకటి నుండి ప్రమోషన్లు వెంటనే కల్పించే విధంగా కృషి చేయాలని ఈపి ఆపరేటర్ లు కోరినట్లు తెలిపారు గతంలో కూడా ఇలాంటి ప్రమోషన్లు సరైన సమయలొ ఇవ్వకపోవటం వలన నష్టం వాటిల్లిందని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా ప్రతి నెల వేతనం అందించే విధంగా కృషి చేయాలని కోరినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో టిబిజికే సిరియా కార్యదర్శి పెండ్యాల అంజయ్య, ఫిట్ కార్యదర్శి తాళ్ళపల్లి రాములు, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శులు వెంకటేశ్వర్లు భాస్కరచారి, దత్తాత్రి తదితర నాయకులు ఉన్నారు
No comments:
Post a Comment