కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 12 ; సింగరేణి కుటుంబం ఆంతా ఒకే చోట చేరి బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవాలని జీఎం రవిశంకర్ అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం గోలేటి జీఎం కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 17న బుధవారం బెల్లంపల్లి ఏరియా గోలేటి లోని సింగరేణి హై స్కూల్, మాదారం రామాలయం ప్రాంగణాలలో ఫామిలీ డే ను నిర్వహిస్తున్నామని జీఎం తెలిపారు. ఫ్యామిలీ డే సందర్భంగా సింగరేణీయులకు ఆట పాట లతో అందరు కలసి ఒక పండుగగా గడువుకోవాలనే సింగరేణి సి ఎం డి శ్రీధర్ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల డాన్స్ గ్రూపులు తమ పేర్లను 15వ తేదీలోపు పర్సనల్ డిపార్ట్మెంట్ లో నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ తినుబండారాల స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా 13 వ తేదీనాడు రాత్రి 8 గంటలకు గోలేటి ఆఫీసర్స్ క్లబ్ ఆమరణలో సి బి మరియు ఎం బి కాలనీ విద్యార్థులకు క్విజ్ , మహిళలకు అంతాక్షరి నిర్వహిస్తున్నామన్నారు. 14 వ తేదీ మాదారం టౌన్ షిప్ సి ఈ ఆర్ క్లబ్ లో సాయంత్రం 4 గంటలకు విద్యార్థులకు క్విజ్, మహిళలకు అంత్యాక్షత్ర్య్ పోటీలను, 15 వ తేదీన గోలేటి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో ఎస్ డి డి క్వార్టర్స్ కాలనీ వారికి క్విజ్, అంత్యాక్షత్ర్య్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 17 వ తేలిన ఫామిలీ డే ను నిర్వహిస్తున్నామన్నారు. కావున సింగరేణీయులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు . ఈ సమావేశంలో డీపీఎం సుదర్శన్, రామశాస్ట్రీ, తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment