Sunday, 14 October 2018

నిషేదిత గుట్కాపొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు ; సిఐ రమణమూర్తి

కొమురంభీం ఆసిఫాబాద్ (రెబ్బెన)  అక్టోబర్  14 : నిషేదిత  గుట్కా పొగాకు ఉత్పత్తులు మండలంలో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని  సిఐ రమణమూర్తి హెచ్చరించారు ఆదివారం  పోలీస్ స్టేషన్ లో   వర్తకులతో  ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గుట్కాలు పొగాకు ఉత్పత్తులు పూర్తిగా  నిషేధించిందన్నారు అన్ని గ్రామాల్లో నిషేధిత వస్తువులు  విక్రయాలకు పాల్పడవద్దని ఆయన వర్తకులకు సూచించారు. కొద్దికాలంగా ఆగిన  అమ్మకాలు  మళ్ళీ కొనసాగుతున్నట్లు దృష్టికి వచ్చినట్లు తెలిపారు మెరుపుదాడులు నిర్వహించి గుట్కా విక్రయాలకు అడ్డుకట్ట వేస్తామని దానికంటే ముందు వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా వాటి అమ్మకాలను నిలిపేయాలని పోలీసుల దాడులలో  గుట్కా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవ ని హెచ్చరించారు.  అమ్మినవారిపై కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు పోలీసులకు  సహకరించాలని కోరారు ఈ సమావేశంలో ఎస్సై దీకొండ రమేష్  ఉన్నారు.

No comments:

Post a Comment