Friday, 5 October 2018

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 5 ; రెబ్బెన మండల కేంద్రానికి  సమీపంలో అంతర  రాష్ట్రీయ  రహదారిపై శుక్రవారం తెల్లవారుఝామున  గంగాపూర్ గ్రామానికి చెందిన గుండ్ల  మహేష్ (36) గుర్తు తెలియని వాహనం ఢీకొని  మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఈ నెల రెండున తన అత్తగారింటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లడం జరిగిందన్నారు. ఐతే నేడు తెల్లవారుఝామున  అంతర్రాష్ట్ర రహదారి దాటు తుండగా గుర్తు తెలియని వాహనం  ఢీకొనడంతో  అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని  శవ పరీక్ష నిమిత్తం ఆసిఫాబాద్ ఆరోగ్య కేంద్రానికి తరలించామన్నారు. ఈ మేరకు తండ్రి గురవయ్యఫిర్యాదు  మేరకు  సి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతునికి  భార్య ఉన్నట్లు  తెలిపారు. 

No comments:

Post a Comment