Sunday, 28 October 2018

మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్ సస్పెన్షన్ ఎత్తివేత

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 28 ;   గోలేటి మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్ పై టీఆర్ఎస్ అధిష్టానం విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ మండల దక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి  తెలిపారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ తాజా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆదేశాల మేరకు  తోట లక్ష్మణ్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు, తెరాస పార్టీలో యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించొచ్చని అన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాజా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలందరూ కృషి చేసి నిరంతరం శ్రమించి గెలిపించాలన్నారు.

No comments:

Post a Comment