Thursday, 11 October 2018

నిఘా, భద్రత మరింత పటిష్టం - డి ఎస్ పి సత్యనారాయణ

 
 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 11: జిల్లా లో  నూతన వాహనాల రాక తో భద్రత మరింత పటిష్టమౌతుందని  డి ఎస్ పి  సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక జిల్లా పోలిస్ హెడ్ క్వార్టర్ నందు జిల్లాకు నూతనముగా కేటాయించబడ్డ 106 ద్విచ్రవాహనం లను, 4 ఇన్నోవా  పెట్రోలింగ్ వాహనాలను, 1 బుల్లెట్ ప్రూఫ్ వాహనము,1 ఫర్చునర్ వాహనలను  నూతన వాహనముల ను రెబ్బెన మండలంలో డి ఎస్ పి  సత్యనారాయణ ప్రారంభించి రెబ్బెనలో రూట్ మార్చ్ నిర్వహించారు.  ఈ పెట్రోలింగ్ వాహనములకు డయల్100  కు కూడా అనుసంధానము తో ఆసిఫాబాద్ నుంచి వాంకిడి,ఆసిఫాబాద్ నుంచి రెబ్బెన , వాంకిడి  నుంచి కెరమెరి, ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్ టౌన్ లు కాగజ్ నగర్ మీదుగా నిరంతరం పెట్రోలింగ్ చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్  రమణ మూర్తి, వాహనాల ఇంచార్జి ఆర్ ఐ శ్రీనివాస్, మండల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

No comments:

Post a Comment