Monday, 29 October 2018

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై అవగాహన

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 29 ; ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదు  పీఆర్టీయూ రెబ్బెన పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు రెబ్బెన మండల నంబాల గంగాపూర్, నవేగం తుంగడ కెజిబివి సింగరేణి గోలేటిలో ఓటు నమోదు పై అవగాహన కార్యక్రమాన్ని  జిల్లా అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాసరావు  ప్రారంభించారు అర్హత  గల ఉపాధ్యాయ అభ్యర్థులు ఫారం  నెంబర్ 19  ద్వారా నమోదు అంశాలను వివరించడం జరిగింది ఒకటి పదకొండు రెండువేల  పన్నెండు నుండి ఒకటి పదకొండు రెండువేల పద్ధెనిమిది కాలంలో కనీసం మూడు సంవత్సరాలు ఉన్న పాఠశాలల్లో పనిచేసిన ప్రతి ఉపాధ్యాయుడు అర్హులని  తెలిపారు.  నవంబర్ 6 తేదీ లోపు సంబంధించిన తహాశీల్దార్ కార్యాలయంలో నమోదు ఫారాలను సమర్పించవల్సిందిగా కోరారు.   కరీంనగర్, మెదక్, ని జామాబాద్ ఆదిలాబాద్ శాసనమండలి ఉపాధ్యాయ అభ్యర్థిగా పీఆర్టీయుటీఎస్ అధికార అభ్యర్థి శ్రీ కూర రఘోత్తంరెడ్డిని  మొదటి ప్రాధాన్య  ఓటు వేసి గెలిపించాలని  కోరారు ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ కొమురంభీం జిల్లా అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె శంకర్ ,సుధాకర్ గౌడ్,  జిల్లా ఉపాధ్యక్షులు బి సదానందం,  ఎస్ కే  ఖాదర్,  జిల్లా కార్యదర్శి లచ్చన్న,  మండల అధ్యక్షుడు టి ప్రవీణ్,  మండల ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్,  మండల కార్యదర్శి కె శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment