Sunday, 21 October 2018

ఎన్నికలలో బీజేపీ అధికారం లోకి వస్తుంది ; రామ్ నాయక్


కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్  21 : ఎన్నికలలలో బీజేపీ అధికారం లోకి వస్తుందని పార్లమెంట్ కో కన్వీనర్ అజమిరా రామ్ నాయక్ అన్నారు. ఆదివారం  రెబ్బెన మండలం లో గడప గడప ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థిని అతధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సింగలగూడా లోనూతన కార్యకర్తలకు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు.  నరేంద్ర మోడీ ప్రెవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ తెలంగాణా రాష్ట్రంలో కూడా బీజేపీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపిస్తే మరెన్నో పథకాలను ప్రజలకు  సమాన అవకాశాలతో  ప్రెవేశ పే డతామని అన్నారు. ప్రస్తుతం ప్రెవేశ పెట్టిన పథకాలకు నిధులన్నీ కేంద్రమే ఇస్తున్న, రాష్ట్ర ప్రభుత్వాం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు.  ఈ కార్యకమంలో ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి, బీజేపీ మండల అధ్యక్షులు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి రాంబాబు , ఇగురాపు సంజీవ్, మల్లేష్, రవీందర్, విజయ్, రాజేష్, సంతోష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment