Saturday, 6 October 2018

ఆడ పిల్లలు నిర్భయంగా ఉండాలి ; ఎస్సై దీకొండ రమేష్

 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు  6 ;  నేటి సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా మంచి పేరు తెచ్చుకొని నిర్భయంగా ఉండాలని    రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్ అన్నారు. రెబ్బెన మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం  ఆధ్వర్యంలో ఈవ్ టీసింగ్ పై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా   ఎస్సై మాట్లాడుతూ  ఎట్టి పరిస్థితులలోను చదువును మధ్యలో ఆపరాదని అన్నారు. పాఠశాలకు వచ్చేటప్పుడు గని, తిరిగి వెళ్ళేటప్పుడుగాని ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను వేధిస్తే నిర్భయంగా తమకు తెలియచేయాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శే టీం ఇంచార్జి మహమ్మద్ ఫసియుద్దీన్, రజిత, సునీత లు విద్ద్యార్దినులకు శే టీం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, ఉపాధ్యాయులు చరణ్ దాస్, శ్రీకాంత్, ఉదయ్, బాలేష్, మొగిలి, తుకారాంఎం, చంద్ర శేఖర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment