Friday, 26 October 2018

పోలీస్ ఉద్యోగార్థులకు శిక్షణా తరగతులు

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 26 ; పోలీస్ శాఖలో ఎస్సై మరియు కాన్స్టేబుల్   ప్రిలిమినరీ పరిక్షాలలో క్వాలిఫై ఐన ఉద్యోగార్ధులకు బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవ సంస్థ తరపున శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించినట్లు డిజిఎం   పెర్సోనల్  కే కిరణ్ శుక్రవారం తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి, మాదారంలలో ఈ శిక్షణ నవంబర్ 1 నుంచి ప్రారంభమౌతుందన్నారు. ఈ ఏరియా లోని ఉద్యోగార్థులు చేసిన విజ్ఞప్తికి జీఎం  రవిశంకర్ సానుకూలంగా స్పందించి ఈ శిక్షణా తరగతులను నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. కావున ఆసక్తి గల, క్వాలిఫై ఐన అభ్యర్థులు తమ క్వాలిఫైయింగ్ లేటర్లతో జీఎం  కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్మెంట్లో  రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. 

No comments:

Post a Comment