Tuesday, 30 October 2018

స్వచ్ఛ భారత్ మిషన్ ను సఫలీకృతం చేయాలి :డి ఆర్ డి ఓ వెంకట్

    కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్  30 :  స్వచ్ఛ భారత్ మిషన్ ను సఫలీకృతం చేయడానికి గ్రామాలలో మరుగు దొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకట్ అన్నారు. మంగళవారం రెబ్బెన మండలం లోని తుంగేడ , గంగాపూర్ మరియు రెబ్బెన గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికి వెళ్లి మరుగు దొడ్ల నిర్మాణ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. నిర్మాణంలో ఉన్న మరుగు దొడ్ల ను  పరిశీలించి వాటిని త్వరిత గతిన పూర్తి చేసేటట్లు చూడాలని అన్నారు. మరుగు దొడ్లు ప్లాన్ ప్రకారం కట్టుకోవాలని సూచించారు.అనంతరం రెబ్బెన మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్ బి ఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ వెంకటయ్య,ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, స్వచ్ఛ భరత్ మిషన్ సభ్యులు ప్రశాంత్, ఫణి., ఏపిఓ కల్పన, పంచాయతీ సెక్రటరీ వంశీ, శ్వేతా తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment