కొమురంభీం ఆసిఫాబాద్ అక్టోబర్ రెబ్బెన 10 : తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికలలో తెరాస పార్టీని గెలిపించాలని , తెలంగాణ ప్రజలకు ఇంతవరకు దేశంలో ఎవరు అమలు చేయని వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించి అమలుచేస్తున్న ప్రభుత్వం ముఖ్య మంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ అన్నారు. బుధవారం రెబ్బెన మండలం దేవులగుడ,లో తెరాస పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీతోఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి ముఖ్య అతిధి గ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ కోసం అహోరాత్రులు శ్రమించి సాధించుకున్న తెలంగాణాను బంగారు తెలంగాణా గా మార్చడానికి ముఖ్య మంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. నాలుగు సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత పాలకులు చేయలేని అభివృద్ధిని చేసి చూపించిందన్నారు రాష్ట్ర అభివృద్ధిని అనునిత్యం అడ్డు పడటానికి, పదవి కాంక్షతో, మహాకూటమిని ఏర్పాటు చేసుకొని టిడిపితో కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, సిపిఐ పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ప్రజలు గమనించి ఎన్నికల్లో మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. సంక్షేమ పథకాలు ఇక ముందు అమలు కావడానికి రాబోయే ఎన్నికలలో ఎం ఎల్ ఏ అభ్యర్థి కోవలక్ష్మి కి ఓటేసి టీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించి గెలిపించాలన్నారు. తెరాస పార్టీలో చేరిన పలువురు నాయకులకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రతి మండలం నుంచి కార్యకర్తలు, నాయకులూ పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, ఎంపీపీ సంజీవ్ కుమార్, వైస్ ఎంపీపీ గుడిసెల రేణుక, జడ్పీటీసీ బాబురావు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కుందారపు శంకరమ్మ, మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, ఉద్యమకారులు నవీన్ జైస్వాల్, చిరంజీవి, మాజీ సర్పంచ్లు పెసర వెంకటమ్మ, గజ్జెల సుశీల, భీమేష్, వెంకటేష్, తదితర నాయకులు ఉన్నారు.
No comments:
Post a Comment